- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vanitha Vijay Kumar: అచ్చం కరోనా దేవిలా ఉన్నావంటూ.. నటిపై మీమ్స్ వైరల్
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ఎంతలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి, మరణాలు ఎక్కువవుతున్నాయి. ఇక కరోనా కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ని అమలుచేస్తున్నాయి. ఇక తమిళనాడులో అయితే ఏకంగా కరోనా దేవికి గుడి కట్టి పూజలు చేయడం సంచలనం గా మారింది. అయితే ఆ కరోనా దేవి విగ్రహం తమిళ నటి వనితా విజయ్ కుమార్ ని పోలి ఉండడం ప్రస్తుతం మరో సంచలనానికి దారితీసింది. Omg whats […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ఎంతలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి, మరణాలు ఎక్కువవుతున్నాయి. ఇక కరోనా కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ని అమలుచేస్తున్నాయి. ఇక తమిళనాడులో అయితే ఏకంగా కరోనా దేవికి గుడి కట్టి పూజలు చేయడం సంచలనం గా మారింది. అయితే ఆ కరోనా దేవి విగ్రహం తమిళ నటి వనితా విజయ్ కుమార్ ని పోలి ఉండడం ప్రస్తుతం మరో సంచలనానికి దారితీసింది.
Omg whats this everyone has been sending me this pic and memes https://t.co/AOTB0WSBBN
— Vanitha Vijaykumar (@vanithavijayku1) May 21, 2021
కొన్ని రోజుల నుంచి కరోనా దేవి విగ్రహం పక్కన వనితా విజయ్ కుమార్ ఫోటో ని పెట్టి ఈమెనే కరోనా దేవి అంటూ కొన్ని మీమ్ పేజీలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మీమ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ మీమ్స్ పై నటి వనితా విజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా తన ఫోటోను, కరోనా దేవి ఫోటోతో ఎడిట్ చేసిన మీమ్స్ ని షేర్ చేస్తూ ” ఓరి దేవుడా! ఇదేంటి, ప్రతి ఒక్కరూ ఈ ఫొటోతో పాటు మీమ్స్ పంపుతున్నారు’ అంటూ మండిపడింది.






