‘భోలా శంకర్‌’ హీరోయిన్ ఫిక్స్.. చెప్పేసిన తమన్నా..

by  |
‘భోలా శంకర్‌’ హీరోయిన్ ఫిక్స్.. చెప్పేసిన తమన్నా..
X

దిశ, సినిమా: మిల్కీ బ్యూటీ తమన్నా మెగాస్టార్ చిరంజీవితో రెండోసారి రొమాన్స్ చేయడానికి సిద్ధమైంది. చిరు, తమన్నా కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం సైరా నరసింహారెడ్డి . అయితే తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటిస్తున్న ‘భోలా శంకర్‌’లో కూడా కథానాయికగా తమన్నా ఖరారు అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. “మెగా మాసివ్ మూవీ #భోలాశంకర్‌లో భాగమైనందుకు గౌరవంగా, ఆనందంగా ఉంది. మరోసారి @KChiruTweets సార్‌తో స్క్రీన్‌ను పంచుకోవడానికి వేచి ఉండలేను! @MeherRamesh గారూ!” అని తమన్నా తన ట్వీట్ కింద రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే ‘భోలా శంకర్’ చిత్రం నవంబర్ 11న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభం కానుంది. డిసెంబర్‌ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో చిరు సోదరి పాత్రలో కీర్తీ మెప్పించనుంది.



Next Story

Most Viewed