తాలిబన్ల అరాచకం.. కాబూల్ ఎయిర్ పోర్టుపై బుల్లెట్ల వర్షం..

by  |
kabool-airport
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు నానాటికీ చేజారిపోతున్నాయి. తాలిబన్ల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఆఫ్ఘన్‌లో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడి పౌరులు విదేశాల సాయం కోరుతున్నారు. కాబూల్ ఎయిర్ పోర్టుకు వచ్చే విమానాల్లోకి ఎక్కి ఇతర దేశాలకు వలస వెళ్ళాలనుకునే వారికి తాలిబన్లు కొత్త ఇబ్బందులు సృష్టిస్తున్నారు.

విమానాశ్రయం వైపు ఎవరూ వెళ్లకుండా చుట్టూ ముళ్ల కంచెను అమర్చారు. ఆఫ్ఘన్ ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు ముళ్ళ కంచెను సైతం దాటేందుకు యత్నిస్తున్న క్రమంలో శుక్రవారం కాబూల్ విమానాశ్రయంపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జర్మనీ దేశానికి చెందిన ఓ పౌరుడు మృతి చెందాడు. కాగా, ఆఫ్ఘన్ నుంచి ఎవరూ వెళ్ళకూడదనే ఉద్దేశ్యంతోనే వారు ఎయిర్ పోర్టుపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.



Next Story