ఆ స్థలాలు కేటాయిస్తే..‘డబుల్’ ఇండ్లను నిర్మిస్తాం: తలసాని

by  |

దిశ,కంటోన్మెంట్: రక్షణ స్థలాలను కేటాయిస్తే కంటోన్మెంట్‌‌లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తామని రాష్ట్ర పశు సంవర్దక,సినిమాటోగ్రఫిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అంబేద్కర్ నగర్, శ్రీరామ్ నగర్‌లో తెలంగాణ సర్కారు నిర్మించిన 264 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు మహముద్ అలీ, మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయన్నలతో కలిసి తలసాని లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. కంటోన్మెంట్‌లో వందల ఎకరాల బి3,బి4 రక్షణ శాఖకు చెందిన ఖాళీ స్థలాలున్నాయని, వాటిని అప్పగిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తుందన్నారు.

ఎన్నో ఏండ్లుగా రక్షణ శాఖ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు ఆయా ఇండ్లను క్రమబద్దికరించకుండా కేంద్రం తాత్సారం చేస్తుందన్నారు. రక్షణ స్థలాల్లో నివసిస్తున్న పేదల ఇండ్లను క్రమబద్దికరించాలని త్వరలోనే కంటోన్మెంట్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని మంత్రి స్పష్టంచేశారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్‌కు దిగి వచ్చేలా ఆందోళనలను ఉదృతం చేస్తామన్నారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ… పేద వర్గాలు కూడా గొప్పగా బతకాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.ఇప్పటికే అర్హులైన పేదలకు పలుచోట్ల డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story