- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తలైవి’ ట్రైలర్ ఆరోజే.. ఎందుకో తెలుసా?
<p>దిశ, సినిమా : ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే రిలీజైన పలు బయోపిక్‌లు సక్సెస్ కాగా ‘సైనా, తలైవి’ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘తలైవి’లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తికావస్తుండగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా ఈ […]</p>

దిశ, సినిమా : ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే రిలీజైన పలు బయోపిక్‌లు సక్సెస్ కాగా ‘సైనా, తలైవి’ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘తలైవి’లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తికావస్తుండగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
కాగా ఈ నెల 23న కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా ‘తలైవి’ ట్రైలర్‌ను విడుదల చేసి తనను సర్‌ప్రైజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మేరకు చెన్నై, ముంబైలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి, కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించగా, జయలలిత నెచ్చెలి శశికళ పాత్రలో పూర్ణ, జయలలిత తల్లిగా భాగ్యశ్రీ, శోభన్‌బాబుగా జిషు సేన్‌గుప్తా నటించారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఏప్రిల్ 23న విడుదల చేయనున్నారు.






