- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారి డబ్బులు తీసుకుని మా పార్టీకి ఓటేయండి
<p>దిశ, గజ్వేల్ : టీఆర్‌ఎస్ ఇచ్చే డబ్బులను తీసుకొని కాంగ్రెస్‌కు ఓటెయ్యండని ప్రజలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు నిచ్చారు. దుబ్బాకలో ప్రచారం పూర్తయ్యే వరకు ప్రతీ నిమిషం అమూల్య మైనదని ఆయన అన్నారు. పోలింగ్ పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చెరుకు ముత్యం రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే దుబ్బాక […]</p>

దిశ, గజ్వేల్ :
టీఆర్‌ఎస్ ఇచ్చే డబ్బులను తీసుకొని కాంగ్రెస్‌కు ఓటెయ్యండని ప్రజలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు నిచ్చారు. దుబ్బాకలో ప్రచారం పూర్తయ్యే వరకు ప్రతీ నిమిషం అమూల్య మైనదని ఆయన అన్నారు. పోలింగ్ పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చెరుకు ముత్యం రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే దుబ్బాక అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. రామలింగారెడ్డి ఏం చేయలేనప్పుడు ఆయన సతీమణి ఏం అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశ్నించారు. రామలింగారెడ్డి బ్రతికుండగా ఆయనను పట్టించుకోని టీఆర్‌ఎస్, మరణించిన తర్వాత ఆయనపై ప్రేమ ఉన్నట్లు ఆ పార్టీ యాక్టింగ్ చేస్తోందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘునందన్ రావు గెలిచినా టీఆర్‌ఎస్‌లోకి వెళతారని వ్యాఖ్యానించారు.






