తాప్సీ రన్నింగ్ టువార్డ్స్ ‘లూప్ లపేట’

by  |
తాప్సీ రన్నింగ్ టువార్డ్స్ ‘లూప్ లపేట’
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యూటిఫుల్ తాప్సీ పన్ను పర్‌ఫెక్ట్ రన్నర్‌గా మారిపోయింది. లేటెస్ట్‌గా తన సోషల్ మీడియా ఎకౌంట్‌లో పోస్ట్ చేసిన పిక్స్.. ‘రష్మి రాకెట్’ కోసం తను ఎంతగా కష్టపడిందో చూపిస్తున్నాయి. తన ఫ్రెండ్ లక్ష్మీ మంచుతో సహా బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం తన మేకోవర్ చూసి ఆశ్చర్యపోగా.. పర్‌ఫెక్షన్ కోసం తప్పడం లేదంటోంది తాప్సీ. తను రన్నింగ్ చేస్తుంటే పర్‌ఫెక్ట్ అథ్లెట్ ఎలా ఉంటారో అలాగే కనిపిస్తుండగా.. డైరెక్ట్ ఇండియా తరపున పోటీ చేసే లెవల్లో ఫిల్మ్ మేకర్స్ తనను రెడీ చేసినట్లున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కాగా భారీ ప్రాక్టీస్, వర్కౌట్‌లతో కూడిన ‘రష్మి రాకెట్’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంపై ఆనందం వ్యక్తం చేసిన తాప్సీ.. బూట్ క్యాంప్‌తో పోల్చింది. తర్వాత ‘లూప్ లపేట’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలిపింది. ‘రష్మి రాకెట్’ షూటింగ్‌తో కష్టపడిన తాను ‘లూప్ లపేట’ షూటింగ్ టైమ్‌లో చిల్ అవబోతున్నట్లు తెలిపింది. జర్మన్ హిట్ ఫిల్మ్ ‘రన్ లోలా రన్’ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో తాహిర్ రాజ్ భాసిన్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. కరోనా ఇన్సూరెన్స్ చేసిన ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం.



Next Story

Most Viewed