- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను అందంగా లేననే విషయం నాకు తెలుసు.. స్టార్ నటి
<p>దిశ, సినిమా : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమై ప్రస్తుతం బాలీవుడ్‌లో రాణిస్తున్న తాప్సీ.. తన అందంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. లేటెస్ట్ ఇంటర్య్యూలో తన బ్యూటీ గురించి ఓపెన్‌గా మాట్లాడిన ఢిల్లీ గర్ల్.. ‘అందమైన హీరోయిన్ల మాదిరి నాకు పెద్ద కళ్లు, సొగసైన ముక్కు, మధురమైన పెదాలు లేవు. నాలాంటి ఉంగరాల జుట్టు సినిమా హీరోయిన్లలో ఎవరికీ లేదు’ అని తెలిపింది. ఈ అందంతో స్కూల్‌లో ఫ్రెండ్స్ ముందు కూడా చాలా డల్‌గా ఫీలయ్యేదాన్నని, లుక్ మార్చుకోవాలని […]</p>

దిశ, సినిమా : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమై ప్రస్తుతం బాలీవుడ్‌లో రాణిస్తున్న తాప్సీ.. తన అందంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. లేటెస్ట్ ఇంటర్య్యూలో తన బ్యూటీ గురించి ఓపెన్‌గా మాట్లాడిన ఢిల్లీ గర్ల్.. ‘అందమైన హీరోయిన్ల మాదిరి నాకు పెద్ద కళ్లు, సొగసైన ముక్కు, మధురమైన పెదాలు లేవు. నాలాంటి ఉంగరాల జుట్టు సినిమా హీరోయిన్లలో ఎవరికీ లేదు’ అని తెలిపింది. ఈ అందంతో స్కూల్‌లో ఫ్రెండ్స్ ముందు కూడా చాలా డల్‌గా ఫీలయ్యేదాన్నని, లుక్ మార్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేశానని చెప్పింది.
ఈ క్రమంలో రకరకాల కెమికల్స్‌తో సెలూన్‌లో చేసిన ప్రయోగాల వల్ల సగం జుట్టు రాలిపోయిందని వెల్లడించింది. ఇలా తన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ప్రయోగాలు చేయడం మానేశానని పేర్కొంది. ఫైనల్‌గా పుట్టుకతో వచ్చిన అందాన్ని ప్రేమించాలనే విషయాన్ని గ్రహించినట్లు తెలిపిన తాప్సీ.. ‘నిజంగా మనల్ని మనం ప్రేమించడం నేర్చుకుంటే ఎంత అందంగా ఉంటుందో పూర్తిగా అర్థం చేసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది.






