తాప్సీ పర్‌ఫెక్ట్ అథ్లెట్ లుక్‌

by  |
తాప్సీ పర్‌ఫెక్ట్ అథ్లెట్ లుక్‌
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యూటిఫుల్ తాప్సీ పన్ను ‘రష్మి రాకెట్‌’గా దూసుకుపోయేందుకు సన్నద్ధమైంది. క్యారెక్టర్‌లో పర్‌ఫెక్షన్ కోసం ఎంత కష్టపడేందుకైనా వెనుకాడని తాప్సీ.. ‘రష్మి రాకెట్’ సినిమా కోసం దాదాపు నెలరోజులుగా కష్టపడుతోంది. గుజరాత్‌లోని ఓ పల్లెటూరికి చెందిన ఫాస్ట్ రన్నర్ రష్మి అనే యువతి కథే.. రష్మి రాకెట్ చిత్ర కథ కాగా, పాత్రలో జీవించేందుకు డైట్ కూడా చేంజ్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ సెషన్స్‌కు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేస్తున్న తాప్సీ.. తాజాగా మరో ఫొటో షేర్ చేసింది.

ట్రాక్‌లో పరుగెత్తేందుకు సిద్ధంగా అథ్లెట్ పోజ్‌లో ఉన్న తాప్సీ.. తనకు సంబంధించిన మొదటివాటిలో ఇది కూడా ఒకటి కానుందని తెలిపింది. ఈ సీన్‌తోనే రష్మి రాకెట్ రీషూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తుండగా.. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఫ్యాన్స్. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కోసం తన మేకోవర్ చూసి ఖుదోస్ చెప్తున్నారు సెలబ్రిటీస్ అండ్ ఫ్యాన్స్. దీంతో పాటు హసీన్ దిల్ రుబా, శభాష్ మిథు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న తాప్సీ.. సౌత్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న సినిమాలోనూ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.



Next Story

Most Viewed