బాయ్‌ఫ్రెండ్ సజెషన్స్ అవసరం లేదు : తాప్సీ

57

దిశ, వెబ్‌డెస్క్ :  బ్యూటిఫుల్ తాప్సీ పన్ను.. బ్యాక్ టు బ్యాక్ స్పోర్ట్స్ ఫిల్మ్స్ చేస్తోంది. ఆకర్ష్ ఖురానా డైరెక్షన్‌లో వస్తున్న ‘రష్మి రాకెట్‌’లో రన్నర్‌గా కనిపిస్తున్న తాప్సీ.. రాహుల్ ఢోలాకియా దర్శకత్వంలో ఇండియన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ కూడా చేస్తోంది. కాగా ఈ సినిమాల కోసం స్పోర్ట్స్ పర్సన్(షట్లర్) అయిన తన బాయ్ ఫ్రెండ్ మాథియాస్ బో నుంచి ఎలాంటి సజెషన్స్ తీసుకున్నారన్న ప్రశ్నకు తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చింది భామ.

బ్రెయిన్ సర్జరీ ఎలా చేయాలో హార్ట్ సర్జన్‌ చెప్పలేడని అనుకుంటున్నానని.. కాబట్టి ఒక క్రీడ గురించి మరో క్రీడకు చెందిన ఆటగాడి నుంచి చిట్కాలు తీసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడింది. తను చేస్తుంది రన్నర్, క్రికెటర్ పాత్రలే గానీ షట్లర్‌గా కాదని.. అలాంటప్పుడు బాయ్ ఫ్రెండ్ నుంచి హెల్ప్, సజెషన్స్ అవసరం లేదంది. కాగా తాప్సీ ఈ మధ్యే ‘రష్మి రాకెట్’ గుజరాత్ షెడ్యూల్ కంప్లీట్ చేసింది. ఈ టైమ్‌లో అథ్లెట్‌గా తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఒక నటి తన సినిమా గురించి ఇంత కష్టపడటాన్ని నెటిజన్లు సైతం అభినందించారు.