ప్లీజ్.. నన్ను లేపొద్దు : తాప్సీ

by  |
ప్లీజ్.. నన్ను లేపొద్దు : తాప్సీ
X

దిశ, వెబ్‌డెస్క్ :
సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుని బాలీవుడ్‌లో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న తాప్సీ పన్ను.. లాక్‌డౌన్ తర్వాత మాల్దీవ్స్‌లో మస్త్‌గా ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. ‘సిస్టర్స్ షగున్ పన్ను, ఎవనియా పన్ను బాయ్ ఫ్రెండ్ మాథియాస్‌బో’తో కలిసి వారం రోజుల పాటు అక్కడే ప్రశాంతంగా గడిపింది. తర్వాత షూటింగ్ ప్రారంభం కావడంతో ముంబై వచ్చేసినా.. తన మనసు మాత్రం ఇప్పటికీ అక్కడే ఉందని చెప్తోంది. ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నాను అంటున్న తాప్సీ.. తాజాగా బీచ్‌లో ఇసుక మీద పడుకుని, మొహం మీద హ్యాట్ పెట్టుకుని సేద తీరుతున్న పిక్‌ను షేర్ చేసింది. కనీసం కలలో అయినా మాల్దీవ్స్‌లో ఉన్నానని అనుకోనివ్వండి. ఆ డ్రీమ్‌ను అలాగే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. దయచేసి నన్ను లేపొద్దు అని రిక్వెస్ట్ చేసింది.

ప్రస్తుతం ‘హసీనా దిల్ రుబా’ షూటింగ్‌లో లైట్స్ కెమెరా యాక్షన్ అంటూ బిజీగా ఉన్న తాప్సీ .. మాల్దీవ్స్‌లో లవ్, జాయ్ గుర్తుకొస్తున్నాయని అంటోంది. కాగా తాప్సీ ‘శభాష్ మిథున్, రష్మి రాకెట్’తో పాటు విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న తమిళ్ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ చేస్తోంది.

Next Story