- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంట్ బిల్ షాక్ కొట్టింది : తాప్సీ
<p>బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను షాక్‌కు గురైందట. ఈ నెల కరెంట్ బిల్ చూసి నిజంగానే కరెంట్ షాక్ కొట్టినంత పనైందని తెలిపింది ఈ పింక్ హీరోయిన్. మూడు నెలల కరెంట్ బిల్ రిసీట్స్ పోస్ట్ చేసిన తాప్సీ.. ‘అందరు ముంబై వాసుల్లానే తను కూడా ఎలక్ట్రిసిటీ బిల్ చూసి బాధపడ్డాను. మూడు నెలలుగా ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రిక్ పరికరాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయి.. అలాంటప్పుడు రెండు నెలలకు రూ. 5000 – 6000 […]</p>

బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను షాక్‌కు గురైందట. ఈ నెల కరెంట్ బిల్ చూసి నిజంగానే కరెంట్ షాక్ కొట్టినంత పనైందని తెలిపింది ఈ పింక్ హీరోయిన్. మూడు నెలల కరెంట్ బిల్ రిసీట్స్ పోస్ట్ చేసిన తాప్సీ.. ‘అందరు ముంబై వాసుల్లానే తను కూడా ఎలక్ట్రిసిటీ బిల్ చూసి బాధపడ్డాను. మూడు నెలలుగా ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రిక్ పరికరాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయి.. అలాంటప్పుడు రెండు నెలలకు రూ. 5000 – 6000 మధ్యలో వచ్చిన కరెంట్ బిల్.. ఇప్పుడు మాత్రం రూ. 36,000 ఎలా వస్తుందని?’ ప్రశ్నించింది. ఆరు రెట్లు ఎక్కువ బిల్ వచ్చిందని చెప్పిన తాప్సీ.. ఇక ఎవరూ నివాసముండని అపార్ట్‌మెంట్‌కు ఇంతకుముందు నెల రూ. 730 బిల్ వస్తే.. ఇప్పుడు రూ. 8640 వచ్చినట్లు బిల్స్ షేర్ చేసింది. సమస్యపై వెంటనే స్పందించాల్సింది పోయి.. అసలు ప్రశ్నించే అనుమతి కూడా ఇవ్వడం లేదని చెప్పింది.
3 months of lockdown and I wonder what appliance(s) I have newly used or bought in the apartment only last month to have such an insane rise in my electricity bill. @Adani_Elec_Mum what kind of POWER r u charging us for? pic.twitter.com/jZMMoxDMgj
— taapsee pannu (@taapsee) June 28, 2020
తాజాగా సౌత్‌స్టార్ కార్తీక నాయర్‌కు రూ. లక్ష ఎలక్ట్రిసిటీ బిల్ రాగా.. స్నేహకు రూ. 76 వేల బిల్ వచ్చిన విషయం తెలిసిందే.






