- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ-హబ్ ఆధ్వర్యంలో 4 రోజుల 'ఇన్నోవేషన్ సమ్మిట్'
<p>దిశ, వెబ్‌డెస్క్: స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే ప్రముఖ టీ-హబ్ దాని ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం(నవంబర్ 23) నుంచి నాలుగు రోజుల పాటు ఇన్నోవేషన్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. ఈ సమ్మిట్‌లో భాగంగా ఎదుగుదల కోరుకునే ఆంత్రప్రెన్యూర్‌లకు, కొత్త ఇన్నోవేషన్లకు మద్దతిచ్చేందుకు ‘వన్న్ ఎకోసిస్టమ్’ ఏర్పాటు లక్ష్యంగా జరగనుంది. ఈ కార్యక్రమమంలో ప్రముఖులు, వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, మార్గదర్శకులు, విద్యావేత్తలను ఒకచోటకు చేరుస్తుందని, వారి నుంచి ఈ ఎకోసిస్టమ్ నిర్మాణంలో సహకారం అందుకోనున్నట్టు’ టీ-హబ్ ప్రతినిధి చెప్పారు. సెంద్రియా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే ప్రముఖ టీ-హబ్ దాని ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం(నవంబర్ 23) నుంచి నాలుగు రోజుల పాటు ఇన్నోవేషన్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. ఈ సమ్మిట్‌లో భాగంగా ఎదుగుదల కోరుకునే ఆంత్రప్రెన్యూర్‌లకు, కొత్త ఇన్నోవేషన్లకు మద్దతిచ్చేందుకు ‘వన్న్ ఎకోసిస్టమ్’ ఏర్పాటు లక్ష్యంగా జరగనుంది. ఈ కార్యక్రమమంలో ప్రముఖులు, వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, మార్గదర్శకులు, విద్యావేత్తలను ఒకచోటకు చేరుస్తుందని, వారి నుంచి ఈ ఎకోసిస్టమ్ నిర్మాణంలో సహకారం అందుకోనున్నట్టు’ టీ-హబ్ ప్రతినిధి చెప్పారు.
సెంద్రియా వృద్ధి వర్సెస్ అకర్బన వృద్ధి, ఆంత్రప్రెన్యూర్ల మనస్తత్వం ఎదుగుదల, పెట్టుబడిదారులకు అవసరమైన అంశాలు, మహిళల పారిశ్రామికవేత్తల పునరుజ్జీవనం వంటి విషయాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్టు టీ-హబ్ ప్రతినిధులు వివరించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఎండియా పార్ట్‌నర్స్ డైరెక్టర్ అభిషేక్ శ్రీవాస్తవ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ రిచ్ అజిత్, వ్యూ హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీప్తి రావుల ప్రసంగించనున్నారు.






