స్టార్టప్‌ల వృద్ధి కోసం కొత్తగా 9 కంపెనీలతో టీ-హబ్ భాగస్వామ్యం!

by  |
T-Hub
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీ-హబ్ వివిధ నిర్వహణ సేవల కోసం 9 కొత్త కంపెనీలతో కలిసి పనిచేయనున్నట్టు మంగళవారం ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో స్టార్టప్‌ల వృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ కంపెనీలు సహాయపడతాయని టీ-హబ్ తెలిపింది. క్యాష్‌ఫ్రీ, కాసిక్స్‌కామ్, సీఎఫ్ఓ బ్రిడ్జ్, కాండ్యూరా, ఫైర్‌ఫ్లైస్ డాట్ ఏఐ, హ్యాండీసెండ్స్, లంచ్‌క్లబ్, సెపియన్స్, ది లీగల్ క్యాప్సూల్స్ కంపెనీలో ఈ భాగస్వామ్యంలో పాల్గొంటాయి. ఈ భాగస్వామ్యం ద్వారా అన్ని టీ-హబ్ స్టార్టప్‌ల సమర్థవంతమైన పనితీరు కోసం సేవల మద్దతు ఇవ్వనున్నాయి.

కరోనా ప్రభావంతో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే స్టార్టప్‌లకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా సహాయం చేయనున్నాయి. ‘ఈ కొత్త భాగస్వామ్యం కరోనా వల్ల నిర్వహణ సవాళ్లను ఎదుర్కొనే స్టారప్‌లకు మద్దతు ఇస్తాయి. అలాగే, ఈ కంపెనీలు స్టార్టప్ సంస్థలకు సాంకేతికంగా, నిర్వహణ పరంగా, అమ్మకాలకు సంబంధించిన అంశాల్లో విలువైన సహయాన్ని అందిస్తాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించే అవకాశం లభిస్తుందని’ టీ-హబ్ సీఈఓ రవి నారాయణ్ చెప్పారు.

ఇప్పటికే స్టార్టప్‌లకు పలు విభాగాల్లో సహాయాన్ని అందిస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్, డిజిటల్ ఓషన్, గూగుల్ క్లౌడ్ వంటి 70 సేవల కంపెనీలకు తోడుగా ఈ తొమ్మిది కంపెనీలు జతకడతాయని ఆయన అన్నారు. ఈ కంపెనీలన్నీ సహకారంతో టీ-హబ్ స్టార్టప్‌లకు దీర్ఘకాలిక స్థిరత్వానికి, ముఖ్యంగా మౌలిక సదుపాయాలను రూపొందించేందుకు వీలు కల్పిస్తుందని రవి నారాయణ్ వివరించారు.


Next Story

Most Viewed