తలుపు చప్పుడు అయితే చాలు.. వారికి వణుకే

156

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో సైకో హల్ చల్ చేస్తున్న సంఘటన శనివారం తెల్లవారుజామున వెలుగుజూసింది. స్థానికుల వివరాల ప్రకారం… పట్టణంలోని శ్రీనివాస‌నగర్‌లో ఒంటరిగా ఉంటున్న మహిళల ఇళ్లను టార్గెట్ చేస్తూ, వీరంగం సృష్టిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఓ మహిళ ఒంటరిగా ఉంటున్న ఇంట్లోకి వెళ్లి గొంతు పట్టి భయభ్రాంతులకు గురి చేశాడు. భయాందోళనకు గురైన మహిళ కేకలు వేయడంతో సదరు సైకో పారిపోయాడు. మహిళ కేకలు విన్న చుట్టుపక్కల కాలనీవాసులు లేచి, విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సైకోను వెంబడించారు. వెంబడించే సమయంలో వారిపై రాళ్లతో దాడి చేశాడు. సైకోకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..