- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ విజిలెన్స్ అడిషల్ ఎస్పీగా జి.స్వరూపరాణి..
<p>దిశ, విశాఖపట్నం : విశాఖ విజిలెన్స్ అడిషల్ ఎస్పీగా జి.స్వరూపరాణి నియమితులయ్యారు. విశాఖ విజిలెన్స్ కార్యాలయంలో బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.2012 బ్యాచ్‌కు చెందిన ఈమె శ్రీకాకుళం , పాలకొండ , హైదరబాద్ , గుంటూరు తదితర జిల్లాల్లో డీఎస్పీ గా విధులు నిర్వహించారు. అనంతరం 2019 లో విశాఖ వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీగా విధులు నిర్వహించిన ఆమె పలు కేసుల్లో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా మహిళలకు చట్టాలపై అవగహన కల్పించటం , మహిళల ఫిర్యాదులపై […]</p>

దిశ, విశాఖపట్నం : విశాఖ విజిలెన్స్ అడిషల్ ఎస్పీగా జి.స్వరూపరాణి నియమితులయ్యారు. విశాఖ విజిలెన్స్ కార్యాలయంలో బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.2012 బ్యాచ్‌కు చెందిన ఈమె శ్రీకాకుళం , పాలకొండ , హైదరబాద్ , గుంటూరు తదితర జిల్లాల్లో డీఎస్పీ గా విధులు నిర్వహించారు. అనంతరం 2019 లో విశాఖ వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీగా విధులు నిర్వహించిన ఆమె పలు కేసుల్లో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా మహిళలకు చట్టాలపై అవగహన కల్పించటం , మహిళల ఫిర్యాదులపై తక్షణం స్పందించేవారు.
అనంతరం విజిలెన్స్ అడిషల్ ఎస్పీగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న నిత్యవసర వస్తువులు పక్కదారి పట్టకుండా సిబ్బందిని సమన్వయ పరుస్తూ దాడులు నిర్వహించటంతో పాటుగా నిత్యవసర వస్తువులు లబ్దిదారులకు సక్రమంగా అందేలా చర్యలు చేపడుతామన్నారు. నిత్యవసర వస్తువుల నాణ్యత,హోటల్ ,రెస్టారెంట్లో ఆహార పదార్ధాల నాణ్యతపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.






