- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వేచ్ఛ కోసం ‘స్వరా’భిషేకం
<p>భారతదేశం నిజంగా ప్రజాస్వామ్య దేశమేనా అని ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్ నటి స్వరాభాస్కర్. హిందూ అమ్మాయి ముస్లింలతో స్నేహం చేయరాదా? అని సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఓ వీడియోపోస్ట్ చేసిన ఆమె బీజేపీపై మండిపడింది. వీడియోలో ఓ అమ్మాయి స్నేహితులతో కలిసి రాగా ముస్లింలతో ఎందుకు వచ్చావ్ అంటూ రచ్చ చేశాడు ఓ ఆర్ఎస్ఎస్ సభ్యుడు. ముస్లిం అబ్బాయి చేయి ఎందుకు పట్టుకున్నావ్? అంటూ గొడవకు దిగాడు. మీ అమ్మానాన్నకు చూపిస్తానంటూ వీడియో తీసి […]</p>

భారతదేశం నిజంగా ప్రజాస్వామ్య దేశమేనా అని ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్ నటి స్వరాభాస్కర్. హిందూ అమ్మాయి ముస్లింలతో స్నేహం చేయరాదా? అని సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేస్తున్నారు.
ట్విట్టర్‌లో ఓ వీడియోపోస్ట్ చేసిన ఆమె బీజేపీపై మండిపడింది. వీడియోలో ఓ అమ్మాయి స్నేహితులతో కలిసి రాగా ముస్లింలతో ఎందుకు వచ్చావ్ అంటూ రచ్చ చేశాడు ఓ ఆర్ఎస్ఎస్ సభ్యుడు. ముస్లిం అబ్బాయి చేయి ఎందుకు పట్టుకున్నావ్? అంటూ గొడవకు దిగాడు. మీ అమ్మానాన్నకు చూపిస్తానంటూ వీడియో తీసి బెదిరించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కాగా, తన అకౌంట్‌లో పోస్ట్ చేశారు స్వరా.
ఇంత అర్థంలేని మాటలు ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరితో స్నేహం చేయాలి? ఎవరితో కలిసి తినాలి? అని డిసైడ్ చేయడానికి వీరెవరు అంటూ ఫైర్ అయ్యారు. కానీ, హిందూ, ముస్లింల తేడా ఏమీ లేదని, ఈ అమ్మాయి ఎంత ధైర్యంగా మాట్లాడిందో చూడండి అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని ఉందని ఆసక్తి కనబరిచారు స్వరాభాస్కర్.






