- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పదంగా యువకుడి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, నర్సంపేట : నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట శివారులో ఓ యువకుడు బావిలో శవంగా తేలిన సంఘటన కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఇప్పల్ తండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్(17) అనే వ్యక్తి మూడు రోజుల కిందట ఇంటి నుండి చెప్పకుండా వెళ్లి పోయాడు. కుటుంబ సభ్యులతో చిన్న ఘర్షణ జరిగినట్లు స్థానికుల ద్వారా తెలిసిన సమాచారం. అతని ఆచూకీ కోసం మూడు రోజులుగా వెతుకుతున్నారు. ఉన్నట్టుండి ఆదివారం మధ్యాహ్నం రాజ్ కుమార్ మృతదేహం […]</p>

X
దిశ, నర్సంపేట : నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట శివారులో ఓ యువకుడు బావిలో శవంగా తేలిన సంఘటన కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఇప్పల్ తండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్(17) అనే వ్యక్తి మూడు రోజుల కిందట ఇంటి నుండి చెప్పకుండా వెళ్లి పోయాడు. కుటుంబ సభ్యులతో చిన్న ఘర్షణ జరిగినట్లు స్థానికుల ద్వారా తెలిసిన సమాచారం. అతని ఆచూకీ కోసం మూడు రోజులుగా వెతుకుతున్నారు.
ఉన్నట్టుండి ఆదివారం మధ్యాహ్నం రాజ్ కుమార్ మృతదేహం ఓ వ్యవసాయ బావిలో లభ్యం అయ్యింది. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా.. లేక వేరే కారణం ఉందా… అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో కొన్ని నిముషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Next Story






