- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిట్స్ కాలేజీలో విద్యార్థి అనుమానాస్పద మృతి
<p>దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఓ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన లక్నేపల్లి గ్రామ పరిధిలోని బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ కాలేజీలో శనివారం తెల్లవారుజామున వెలుగుజూసింది. వివరాల్లోకి వెళితే.. బాలాజీ కళాశాలలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఈ మధ్యనే తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో ఇదే కళాశాలలో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సంజయ్ అనే విద్యార్థి కాలేజీలోని హస్టల్‌లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి తోటి […]</p>

దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఓ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన లక్నేపల్లి గ్రామ పరిధిలోని బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ కాలేజీలో శనివారం తెల్లవారుజామున వెలుగుజూసింది. వివరాల్లోకి వెళితే.. బాలాజీ కళాశాలలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఈ మధ్యనే తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో ఇదే కళాశాలలో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సంజయ్ అనే విద్యార్థి కాలేజీలోని హస్టల్‌లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి తోటి విద్యార్థితో గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త ముదిరింది.
ఆగ్రహంతో తోటి విద్యార్థి తోసేయడంతో బిల్డింగ్ పై నుండి కిందపడి సంజయ్ మృతి చెందినట్లు సమాచారం. ఈ మేరకు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే ఈ పరిస్థితి దాపురించిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న నర్సంపేట ఎస్ఐ రామ్ చరణ్‌ను కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Bits College






