కీచక యువకుడికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్

by Batti.Sumithra |

<p>దిశ, జడ్చర్ల : యువతులను ట్రాప్ చేసి అత్యాచారాలు చేస్తున్న ముఠాకు సహకరించిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బాలికలు, యువతులకు మాయమాటలు చెప్పి వారిని నమ్మించి తమతో తీసుకువెళ్లి శారీరక వాంఛలు తీర్చుకుంటున్న ముఠాకు సహకరించడమే కాకుండా, ఇలాంటి కార్యకలాపాలకు తన ఇంటినే అడ్డాగా మార్చిన జడ్చర్ల మండలం పోచమ్మ గడ్డ తండా గ్రామపంచాయతీ కి చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి సంపంగి మహేష్ ను తక్షణమే [&hellip;]</p>

కీచక యువకుడికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్
X

దిశ, జడ్చర్ల : యువతులను ట్రాప్ చేసి అత్యాచారాలు చేస్తున్న ముఠాకు సహకరించిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బాలికలు, యువతులకు మాయమాటలు చెప్పి వారిని నమ్మించి తమతో తీసుకువెళ్లి శారీరక వాంఛలు తీర్చుకుంటున్న ముఠాకు సహకరించడమే కాకుండా, ఇలాంటి కార్యకలాపాలకు తన ఇంటినే అడ్డాగా మార్చిన జడ్చర్ల మండలం పోచమ్మ గడ్డ తండా గ్రామపంచాయతీ కి చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి సంపంగి మహేష్ ను తక్షణమే నిధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఒక ప్రకటనలో తెలిపారు.

జడ్చర్ల ప్రాంతంలో ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న రాజాపూర్ మండలానికి చెందిన ఒక ప్రైవేటు టీచర్ కు, వారి ముఠాకు ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి సహకరించడమే కాకుండా అలాంటి కార్యకలాపాలకు తన ఇంటిని అడ్డాగా మార్చారని పేర్కొంటూ గురువారం వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. పోలీసుల విచారణలో ఇది నిజమని తేలడంతో పోచమ్మగడ్డ తాండ గ్రామ పంచాయతీ జూనియర్ పంచాయతీ కార్యదర్శిని విధులనుండి సస్పెండ్ చేశారు.

Next Story