సుస్మితాసేన్ కూతురి యాక్టింగ్ ఎంట్రీ

by  |
సుస్మితాసేన్ కూతురి యాక్టింగ్ ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ కూతురు రెనీ సేన్ యాక్టింగ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టేసింది. ‘సట్టబాజీ’ షార్ట్‌ఫిల్మ్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. ‘స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్’ ట్యాగ్ లైన్‌తో వస్తున్న షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. స్మోకింగ్‌కు అలవాటు పడిన టీనేజర్‌గా నటిస్తున్న రెనీ..లాక్ డౌన్‌లో ఇంట్లోనే ఉండటం వల్ల స్మోక్ చేసే చాన్స్ లేక ఎలాంటి ఇబ్బందులు పడింది? తల్లిదండ్రులకు తెలియకుండా వాష్ రూమ్‌లో స్మోక్ చేసిన టీనేజర్..స్మెల్ బయటకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? కూతురిపై డౌట్ వచ్చిన ఫాదర్ తనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోగలడా? ఈ విషయాన్ని రెనా తల్లికి చెప్తే ఎలా స్పందించింది? అనేది ట్రైలర్‌లో చాలా ఫన్నీగా చూపించారు డైరెక్టర్ కబీర్ ఖురానా.

రెనీ ఆన్ లైన్ క్లాస్‌లతో ఫ్రస్ట్రేట్ కావడం..ఇన్‌స్టాగ్రామ్ లైవ్, చాటింగ్‌పై ఇంట్రెస్ట్ చూపించడం.. దీని మీద తండ్రి ఫైర్ కావడం.. ఇలా తల్లిదండ్రులు, ఒక టీనేజర్ మధ్య ఈ రోజుల్లో రిలేషన్ ఎలా ఉంది? అనేది కథగా తీసుకున్న కబీర్ ఖురానా.. జనానికి నచ్చే రీతిలో చాలా నార్మల్‌గా డైలాగ్స్ రాసుకున్నారని, ట్రైలర్ అట్రాక్టింగ్‌గా ఉందని అంటున్నారు నెటిజన్లు. రెనీసేన్ యాక్టింగ్ నేచురల్‌గా ఉందని, తన కెరీర్ బెస్ట్‌గా బాగుండాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. కాగా, సిమ్రన్ లఖన్‌పాల్, రమ్‌నీక్ సానే, పంకజ్ రంగ్టా నిర్మించిన ‘సట్టబాజీ’ త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది.

Next Story

Most Viewed