షాకింగ్: మారిన సుశాంత్ డీపీ.. మార్చిందెవరంటున్న ఫ్యాన్స్

by  |
షాకింగ్: మారిన సుశాంత్ డీపీ.. మార్చిందెవరంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : లేట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. లేటెస్ట్‌గా తన ఫేస్ బుక్ ఎకౌంట్ డిస్‌ప్లే పిక్చర్ అప్‌డేట్ కావడంతో షాక్ అయ్యారు. పిక్చర్ చేంజ్ అయిన కొద్ది నిమిషాలకే కామెంట్ల వర్షం మొదలైంది. ‘ఓ మై గాడ్.. నేను షాక్ అయ్యా. సుశాంత్ ఎకౌంట్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? సుశాంతే పేజ్ మేనేజ్ చేస్తున్నట్లుగా అప్‌డేట్ ఎలా ఇవ్వగలిగాడు?’ అని కామెంట్ చేశాడు ఓ అభిమాని. ‘ఇదెలా సాధ్యం?’ అని మరో ఫ్యాన్ కామెంట్ చేస్తే.. ‘స్వర్గానికి ఇంటర్నెట్ ఉందా?’ ఇంకొక వీరాభిమాని రిప్లై ఇచ్చాడు. ‘సుశాంత్ బ్యాక్ వచ్చేశాడని ఒక సెకన్ షాక్‌లో ఉన్నానని, ఈ ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేయడం ద్వారా ఏం చెప్పాలని అనుకుంటున్నారని’ ప్రశ్నించాడు మరో నెటిజన్.


Next Story

Most Viewed