తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్పొరేట్ కళాశాలలతో కుమ్మక్కైంది.. సూర్య ప్రకాష్

by  |
abvp
X

దిశ, చేవెళ్ల: ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పిలుపుతో మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలో ఉన్న అన్ని కళాశాలలను బంద్ చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏబీవీపీ రాష్ట్ర నాయకులు సూర్యప్రకాష్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఆన్లైన్ క్లాస్లులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు. ఇంటర్ బోర్డు ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా పరీక్షలు నిర్వహించిదని ఆరోపించారు. అంతే కాకుండా ఫలితాల్లో కూడా సాంకేతిక లోపాలు చూపించడం ద్వారా అనేక మంది విద్యార్థులు మానసికంగా క్రుంగి పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

ఇంటర్మీడియట్ ఫలితాలు ఘటనపై సీఎం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక లోపాలను సవరించి.. ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కళాశాలలతో కుమ్మక్కైన ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కన్వీనర్ షాపూర్ శ్రీకాంత్, చేవెళ్ల కార్యదర్శి శిరీష, చందు, శివ, ఆనంద్, హరికృష్ణ, విష్ణు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed