రౌడీషీటర్లు, చైన్ స్నాచర్లపై నిఘా

by Batti.Sumithra |

<p>దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా కేసులు సెకండ్ వేవ్‌లో మరింత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నగరంలో పలు నేరాలకు పాల్పడే రౌడీషీటర్లు, చైన్ స్నాచర్లపై నిరంతరం పర్యవేక్షించాలని నగర సీపీ అంజనీకుమార్ సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పోలీసులు, కుటుంబ సభ్యులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగరంలోని పోలీస్ స్టేషన్ల హౌజ్ ఆఫీసర్లు, ఏసీపీలు, డీసీపీలు, అడిషనల్ సీపీలతో మంగళవారం సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా [&hellip;]</p>

రౌడీషీటర్లు, చైన్ స్నాచర్లపై నిఘా
X

దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా కేసులు సెకండ్ వేవ్‌లో మరింత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నగరంలో పలు నేరాలకు పాల్పడే రౌడీషీటర్లు, చైన్ స్నాచర్లపై నిరంతరం పర్యవేక్షించాలని నగర సీపీ అంజనీకుమార్ సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పోలీసులు, కుటుంబ సభ్యులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగరంలోని పోలీస్ స్టేషన్ల హౌజ్ ఆఫీసర్లు, ఏసీపీలు, డీసీపీలు, అడిషనల్ సీపీలతో మంగళవారం సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక పరమైన నేరాలు పెరిగే అవకాశం ఉన్నందున నగరంలోని రౌడీ షీటర్లు, చైన్ స్నాచర్లపై ప్రత్యేక దృష్ఠి ఉంచాలన్నారు.

నిత్యం వారి కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయాలన్నారు. గత మూడేళ్లుగా నగరంలోని చైన్ స్నాచర్లు, రౌడీ షీటర్లపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. నగరంలో నేరస్థులను పట్టుకోవడానికి ప్రధాన సాధనంగా ఉండే సీసీ టీవీ కెమెరాల పనితీరును ఆయా స్థానిక అధికారులు పర్యవేక్షించాలన్నారు. పోలీస్ శాఖలో అత్యధికంగా కోవిడ్ బారిన పడుతుండగా.. తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని అన్నారు. పోలీసులు కుటుంబ సభ్యులు సైతం వ్యాక్సిన్ వేయించుకోవడానికి తప్పనిసరిగా వారి పేర్లను ఆధార్ నెంబరుతో సహా నమోదు చేసుకోవాలని సూచించారు. పోలీసు ఫ్యామిలీ మెంబర్స్ వ్యాక్సిన్ తీసుకునేలా స్థానిక ఏసీపీ, డీసీపీ అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే, ఆయా ఏసీపీ, డీసీపీ పరిధిలలో వాట్సప్ గ్రూపులను తయారు చేసుకుని మోనిటరింగ్ చేసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ సీపీ శిఖా గోయెల్, అనిల్ కుమార్, డీఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story