వరల్డ్ రికార్డ్ సృష్టించిన సూర్య ‘ఆకాశం నీ హద్దురా!’

by  |
Soorarai Pottru
X

దిశ, సినిమా : సూర్య నటించిన ‘సూరారై పోట్రు(ఆకాశం నీ హద్దురా)’ చిత్రం ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది. తన నటనతో బిగ్ స్క్రీన్‌పై మరోసారి మ్యాజిక్ చేసిన సూర్య.. లో- కాస్ ఎయిర్ లైన్, ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీ.ఆర్.గోపీనాథ్ పాత్రలో జీవించేశాడు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ కాగా.. బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో కూడా ప్రదర్శితమైంది. కాగా ‘సూరారై పోట్రు’ ఇప్పుడు మరో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. IMDbలో అత్యధిక రేటింగ్ పొందిన మూడవ చిత్రంగా నిలిచింది. ది షావ్‌శాంక్ రిడంప్షన్ (1994), ది గాడ్‌ఫాదర్ (1972) తర్వాత 9.1 రేటింగ్‌తో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

Next Story

Most Viewed