కరోనా ఎఫెక్ట్… సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్

by  |
కరోనా ఎఫెక్ట్… సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారత్‌లోనూ వ్యాప్తి చెందుతున్న కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో రోజూ వారి కూలీలు ఆర్థికంగా చాలా కష్టపడుతున్నారు. దీంతో పలువురు ప్రముఖులు ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీస్‌లో చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వారు ఇప్పటికే విరాళాలు అందిస్తారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ రూ. కోటి విరాళం అందిస్తున్నట్లు ప్రకటించింది. సినీ కార్మికులు, హెల్త్ కేర్ వర్కర్స్‌కు సహాయం అందించనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు సీఎం సహయనిధికి, సినీ కార్మికులకు ప్రముఖులు విరాళాలు ప్రకటించగా… సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు, వెంకటేష్, రానాలు తొలిసారి హెల్త్ కేర్ వర్కర్స్‌కు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

కోవిడ్ 19 వ్యాధి కారణంగా పేద కుటుంబాలు రోజువారి అవసరాలు తీర్చుకునేందుకు కూడా కష్టపడుతున్నారని తెలిపారు సురేష్ బాబు. షూటింగ్స్ నిలిచిపోయి, థియేటర్లు మూతపడి చాలా నష్టం జరిగిందని.. తద్వారా సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే హెల్త్ కేర్ వర్కర్స్ ప్రాణానికి నష్టముందని తెలిసినా చాలా రిస్క్ చేస్తున్నారని.. ఎంత ప్రమాదం ఉన్నా పేషెంట్లతో గడపాల్సి వస్తుందన్నారు. నిజంగా వారు హీరోలు అని అభినందించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తప్పకుండా ప్రభుత్వం అందిస్తున్న సూచనలు పాటించాలని కోరారు.

Tags: Suresh Productions, Suresh Babu, Venkatesh, Rana, CoronaVirus, Covid19

Next Story