పట్టపగలే సినీ నటుడి దారుణ హత్య

472

దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటక రాష్ట్రంలో పట్టపగలే ఓ సినీ నటుడు హత్య గావించబడ్డాడు. తుళు నటుడు సురేంద్ర బంట్వాల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం దారుణంగా హత్య చేశారు. ఆయనకు రౌడీ నేపథ్యం ఉండటంతో పాటు, పోలీసులు రౌడీ షీట్‌ కూడా తెరిచారని సమాచారం. కన్నడ, తుళు చిత్రాల్లో నటించిన సురేంద్రకు కొందరితో ఆర్థిక లావాదేవీల సమస్యలు ఉన్నాయని, అందువల్లే ఆయన్ను హత్యచేసి ఉండవచ్చనేది ప్రాథమిక సమాచారం.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బంట్వాల్‌లో ఉన్న బీసీ రోడ్డులో సురేంద్ర నివాసముంటున్నారు. ఆయన అపార్టుమెంట్‌లో ఉండగా, కొందరు దుండగులు వచ్చి హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. గతంలో బీజేపీ నాయకులను బెదిరించిన కేసులో సురేంద్ర జైలుకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవలే బెయిల్‌ మీద విడుదలయ్యారట. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్‌ అయ్యారు. తుళు సినిమా ‘ఛలి పొలిలు’, కన్నడ సినిమా ‘సవర్ణ దీర్ఘ సంధి’లో సురేంద్ర నటించారు.