ఫ్లాష్.. ఫ్లాష్.. గణేష్ నిమజ్జనాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

871
Ganesh Immersions

దిశ, డైనమిక్ బ్యూరో : హుస్సేన్ సాగర్‌లో పీఓపీ గణనాథులను నిమజ్జనం చేయొద్దన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కుదరదని, నిమజ్జనాలను నిలిపివేస్తే గందరగోళం నెలకొంటుందన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే, ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిమజ్జనాలకు అనుమతిచ్చింది. దీంతో ఇన్నిరోజులుగా నెలకొన్న సందిగ్ధత ముగియగా.. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

అయితే.. ఈ ఏడాదికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని.. ఇదే చివరి అవకాశం అని సీజేఐ స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం హైకోర్టుకు నిమజ్జనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..