కేంద్రం, ట్విట్టర్ ఇండియాకు ‘సుప్రీం’ నోటీసులు

by  |
supreme court notices to twitter
X

న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత కంటెంట్‌ నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. తమ స్పందన తెలుపాలని ఆదేశించింది. ఫేక్, బూటకపు సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా విద్వేషాలను ప్రచారం చేయడంతోపాటు హింసను ప్రేరేపించే సందేశాలు పంపుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ట్విట్టర్ కంటెంట్‌ను తనిఖీ చేయడం కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ నేత వినిత్ గోయెంక అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేశారు.

గోయెంక తరఫున న్యాయవాది అశ్వినీ దూబే వాదనలు వినిపిస్తూ అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు, ప్రముఖుల పేరిట వందల కొద్దీ బోగస్ ఫేస్‌బుక్ ఖాతాలు, ఫేక్ ట్విట్టర్ హ్యాండిళ్లు ఉన్నాయని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత కంటెంట్‌ను నియంత్రంచడం కోసం యంత్రాంగం అవసరమని తెలిపారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ ఇండియాకు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని జస్టిస్ జస్టిస్ ఏఎస్ బొపన్న, వీ రామసుబ్రహ్మణ్యంలతో కూడి త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఇతర విషయాలపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో కలపి విచారిస్తామని తెలిపింది.



Next Story

Most Viewed