- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెరుగుపడిన రజినీ ఆరోగ్యం.. సాయంత్రం డిశ్చార్జ్!
<p>దిశ, వెబ్‌డెస్క్: స్వల్ప అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు. రజినీ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వర్గాలు శనివారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశాయి. రజినీకి మరికొన్ని వైద్య పరీక్షలను నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పరీక్షల నివేదికలు సాయంత్రకల్లా వస్తాయని చెప్పారు. ఇక రక్త పోటు హెచ్చు, తగ్గులకు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా రజినీ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆస్పత్రి వైద్యులు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: స్వల్ప అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు. రజినీ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వర్గాలు శనివారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశాయి. రజినీకి మరికొన్ని వైద్య పరీక్షలను నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పరీక్షల నివేదికలు సాయంత్రకల్లా వస్తాయని చెప్పారు. ఇక రక్త పోటు హెచ్చు, తగ్గులకు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా రజినీ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆస్పత్రి వైద్యులు సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో రజినీకాంత్‌కు చికిత్స కొనసాగుతోంది. రజినీ డిశ్చార్జ్‌పై సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని అపోలో వైద్యులు వెల్లడించారు. నిన్నటికంటే ఈరోజు ఆయన ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. బీపీ కంట్రోల్లోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో వైద్యులు వెల్లడించారు.






