- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళపతి విజయ్ కోసం రజినీకాంత్.. ‘ఎక్స్’లో ఆసక్తికర ట్వీట్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జననాయకన్' సినిమా విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జననాయకన్' సినిమా విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని, ఇది క్షమించరాని నేరమని ఆయన పేర్కొన్నారు. "ఒక సినిమా వెనుక ఎంతోమంది కష్టం, కోట్లాది రూపాయల పెట్టుబడి ఉంటుంది. అలాంటిది సినిమా ఇలా లీక్ అవ్వడం దిగ్భ్రాంతికరం. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈ పైరసీకి పాల్పడిన వారిని గుర్తించి కఠిన శిక్షలు పడేలా చూడాలి" అని డిమాండ్ చేశారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా, చిత్ర పరిశ్రమలోని వివిధ సంఘాలు, నిర్మాతలు, నటీనటులు అందరూ ఏకమై పైరసీకి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరే సినిమాకు ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆయన ఆకాంక్షించారు. పెద్ద బడ్జెట్ సినిమా ఇలా లీక్ అవ్వడంతో విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.






