దుబాయికెళ్లిన సూపర్‌స్టార్ విత్ ఫ్యామిలీ

by  |

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు..‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్‌బాస్టర్ మూవీ తర్వాత చేస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ దుబాయిలో ప్రారంభం కాబోతుందట. ఈ నేపథ్యంలో మహేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌కి పయనమయ్యాడు.

మూవీయూనిట్ సభ్యులతో దుబాయిలో మహేశ్..శుక్రవారం తన భార్య నమ్రత జన్మదినోత్సవాన్ని సెలెబ్రేట్ చేయనున్నారు. బర్త్ డే వేడుకల తర్వాత నమత్ర, పిల్లలు హైదరాబాద్ తిరిగి వచ్చేస్తారని సమాచారం. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ అక్కడ జరగనుంది. ఈ లాంగ్ షెడ్యూల్ తర్వాతే మహేశ్ హైదరాబాద్ తిరిగి వస్తారని తెలుస్తోంది.

Next Story