నటికి కాస్మెటిక్ ట్రీట్మెంట్‌ ఫెయిల్.. సదరు కంపెనీపై కేసు

by Shyam |

<p>దిశ, సినిమా : సూపర్ మోడల్ లిండా ఎవెంగెలిస్టా ఫ్యాషన్ వరల్డ్‌లో బిగ్గెస్ట్ నేమ్. 80వ దశకంలోనే కెరియర్ స్టార్ట్ చేసిన కెనడియన్ మోడల్.. కేవలం ర్యాంప్ వాక్‌కు మాత్రమే పరిమితం కాకుండా తన టాలెంట్‌తో దాదాపు అన్ని మ్యాగజైన్ కవర్స్‌పై మెరిసింది. అయితే ఐదేళ్ల క్రితం కాస్త బొద్దుగా మారడంతో ఫ్యాట్ రిమూవింగ్(ఫ్యాట్ ఫ్రీజింగ్ ప్రొసిజర్) కోసం కాస్మెటిక్ ట్రీట్మెంట్ ట్రై చేసింది లిండా. కానీ అది కూడా ఫెయిల్ కావడంతో స్లిమ్‌గా మారేందుకు బదులుగా [&hellip;]</p>

నటికి కాస్మెటిక్ ట్రీట్మెంట్‌ ఫెయిల్.. సదరు కంపెనీపై కేసు
X

దిశ, సినిమా : సూపర్ మోడల్ లిండా ఎవెంగెలిస్టా ఫ్యాషన్ వరల్డ్‌లో బిగ్గెస్ట్ నేమ్. 80వ దశకంలోనే కెరియర్ స్టార్ట్ చేసిన కెనడియన్ మోడల్.. కేవలం ర్యాంప్ వాక్‌కు మాత్రమే పరిమితం కాకుండా తన టాలెంట్‌తో దాదాపు అన్ని మ్యాగజైన్ కవర్స్‌పై మెరిసింది. అయితే ఐదేళ్ల క్రితం కాస్త బొద్దుగా మారడంతో ఫ్యాట్ రిమూవింగ్(ఫ్యాట్ ఫ్రీజింగ్ ప్రొసిజర్) కోసం కాస్మెటిక్ ట్రీట్మెంట్ ట్రై చేసింది లిండా. కానీ అది కూడా ఫెయిల్ కావడంతో స్లిమ్‌గా మారేందుకు బదులుగా మరింత బొద్దుగా షేప్ లెస్‌గా మారిపోయింది. దీంతో ఒకప్పుడు సూపర్ మోడల్‌గా రాణించిన భామ.. తన బాడీ టోటల్‌గా షేప్ అవుట్ కావడంతో బయటకు రాలేకపోయానని తెలిపింది.

ఇక జెల్టింగ్ కూల్ స్కల్పింగ్ విధానం ద్వారా బాడీ పూర్తిగా మారిపోయిందని, దీంతో మోడలింగ్ వర్క్ చేయలేకపోతున్నందుకు చాలా మంది ఫాలోవర్స్ బాధపడుతున్నారని తెలిపింది. కూల్ స్కల్పింగ్ అనేది బాడీ షేపింగ్ టెక్నిక్ కాగా.. ఇందులో బాడీ పార్ట్స్‌లో కోల్డ్ టెంపరేచర్ అప్లై చేయడం ద్వారా ఫ్యాట్‌ రిమూవ్ చేస్తారు. అయితే ఈ ప్రాసెస్ తన కొవ్వు కణాలు పెంచాయో తగ్గించాయో తెలియదు కానీ తనను శాశ్వతంగా వైకల్యమున్న వ్యక్తిగా మార్చేసిందని, బాడీని కరెక్ట్ ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు మరో రెండు సర్జరీలు చేసినా లాభం లేకుండా పోయిందని, పైగా ఇందువల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ తన రోజూవారి జీవితాన్ని నాశనం చేశాయని తెలిపింది.

తీవ్ర నిరాశ, దు:ఖం, ఆత్మన్యూనత భావనకు లోనైన తను ఒంటరిని అయిపోయానని, ఈ అవమానం నుంచి బయటపడేందుకు ఇలాంటి జీవితాన్ని జీవించేందుకు అలసిపోయిన తను.. తల ఎత్తుకుని ఈ నాలుగు గోడల నుంచి బయటకు వచ్చేందుకు నిర్ణయించుకున్నానని సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ సూపర్ మోడల్ సదరు కంపెనీపై కేసు కూడా ఫైల్ చేసింది. కాగా దీనిపై స్పందించిన మోడల్స్, సెలబ్రిటీస్.. ఆమె గట్స్ అండ్ స్ట్రెంథ్‌కు సలామ్ చేస్తున్నారు. ఈ 50 ఏళ్ల మోడల్ కమ్ బ్యాక్ ఇతరులకు స్ఫూర్తినిస్తుందంటున్నారు.

Next Story