కెప్టెన్ బర్త్‌ డే రోజు.. హైదరాబాద్ ఘన విజయం

by  |
కెప్టెన్ బర్త్‌ డే రోజు.. హైదరాబాద్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సాగిన ఐపీఎల్ 47వ మ్యాచ్‌లో హైదరాబాద్ విధ్వంసం సృష్టించింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టును 131 పరుగులకే కుప్పకూల్చి..88 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్ ఆశల పైనే కాకుండా.. సీజన్‌లో దూసుకుపోతున్న జట్టును కుప్పకూల్చడంతో ఫైనల్‌ వరకు వచ్చే సత్తా ఉందని నిరూపించింది. ముఖ్యంగా హైదరాబాద్‌ స్పిన్నర్ రషీద్ ఖాన్ 4 ఓవర్లు వేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం గమనార్హం.

ఢిల్లీ ఇన్నింగ్స్:

220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు ఆదిలోనే కుప్పకులారు. గబ్బర్ శిఖర్ ధావన్(0) డకౌట్‌తో ఢిల్లీ ఓటమి మొదలైంది. ఆ తర్వాత వచ్చిన స్టోయినిస్(5), షిమ్రాన్ హెట్నేయర్(16) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. దీంతో 54 పరుగులకే ఢిల్లీ 3 వికెట్లను కోల్పోయింది. ఇక ఓపెనర్ అజింక్య రహనే (26) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇక ఆతర్వాత వచ్చిన రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ జట్టును ఆదుకునే ప్రయత్నంలో విఫలం అయ్యారు. రిషబ్ 36 పరుగులతో రాణించిన.. కెప్టెన్ మాత్రం 7 పరుగులకే బ్యాట్ వదిలేశాడు. దీంతో ఢిల్లీ ఓటమి దాదాపు ఖరారు అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఏ ఆటగాళ్లలో హార్డ్ హిట్టర్ లేకపోవడంతో హైదరాబాద్ బౌలర్లు పదును పెంచి క్రమంగా వికెట్లు తీశారు. అక్సర్ పటేల్ (1), కగిసో రబాడా (3), రవిచంద్రన్ అశ్విన్ (7), ఎన్రిచ్ నొర్ట్జే (1) పరుగు మాత్రమే చేశారు. ఇక లోయర్ ఆర్డర్ లో వచ్చిన తుషర్ దేశ్‌పాండే 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ఢిల్లీ విజయం అందనంత ఎత్తులో ఉండిపోయింది. 19 ఓవర్లలోనే 131 పరుగుల వద్ద బ్యాట్స్‌మెన్లు కుప్పకూలడంతో హైదరాబాద్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీనికి తోడు హైదరాబాద్ కెప్టెన్ తన బర్త్ డే రోజు అభిమానులకు పెద్ద ట్రీట్ ఇచ్చాడని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

హైదరాబాద్ ఇన్నింగ్స్:

ఐపీఎల్ 47వ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుకు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు చుక్కలు చూపించారు. ఏకధాటిగా బౌండరీలు బాదుతూ బౌలర్ల వెన్నులో వణుకుపుట్టించారు. భారీ స్ట్రైక్‌రేట్ మెయింటేన్ చేస్తూ భారీ స్కోరు నమోదు చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 219 స్కోరు నమోదు చేసింది. డేవిడ్ వార్నర్(66) తొలి 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసి భారీ స్కోరుకు పునాదులు వేశాడు. ఇక ఆ తర్వాత వృద్ధిమాన్ సాహ(87) కూడా బౌండరీల మోత మోగించాడు. తాను కూడా తొలి 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు బ్యాట్స్‌మెన్లు మైదానంలో వీర విహారం చేశారు.

వీరిద్దరు కలిసి 58 బంతుల్లో 107 పరుగులు చేశారు. ఆ తర్వాత 107 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(44 నాటౌట్) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఆతర్వాత 170 పరుగుల వద్ద వృద్ధిమాన్ సాహ కూడా క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో మిడిలార్డర్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్ 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు దీంతో హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది.

వృద్ధిమాన్ సాహో.. వార్నర్ అదరహో

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులో ముఖ్యంగా వృద్ధిమాన్ సాహో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి నుంచి నిలకడగా రాణిస్తూ ఒక్కసారిగా ఉరిమాడు. మొత్తం 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి 87 పరుగులు చేశాడు. ఇక డేవిడ్ వార్నర్ కూడా తన బర్త్ డే రోజు అభిమానులకు గుర్తుండేలా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 66 పరుగులు చేశాడు. వీరిద్దరు 58 బంతుల్లో 107 పరుగుల భాగస్వామ్యం చేసి స్కోరు బోర్డును పరిగెత్తించారు. ఇక ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే కూడా 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో స్కోరు బోర్డు 219కు చేరుకుంది.

స్కోరు బోర్డు:

1. డేవిడ్ వార్నర్ (c)c అక్సర్ b అశ్విన్ 66(34)
2. వృద్ధిమాన్ సాహ (wk)c శ్రేయాస్ అయ్యర్ b నొర్ట్జే 87(45)
3. మనీష్ పాండే నాటౌట్ 44(31)
4. కేన్ విలియమ్సన్ నాటౌట్ 11(10)

ఎక్స్‌ట్రాలు: 11

మొత్తం స్కోరు: 219

వికెట్ల పతనం: 107-1 (డేవిడ్ వార్నర్, 9.4), 170-2 (వృద్ధిమాన్ సాహ, 14.3)

బౌలింగ్:

1. ఎన్రిచ్ నొర్ట్జే 4-0-37-1
2. కగిసో రబాడా 4-0-54-0
3. రవిచంద్రన్ అశ్విన్ 3-0-35-1
4. అక్సర్ పటేల్ 4-0-36-0
5. తుషర్ దేశ్‌పాండే 3-0-35-0
6. మార్క్యూస్ స్టోయినిస్ 2-0-15-0

Delhi Capitals Innings:
1. అజింక్య రహనే lbw b రషీద్ ఖాన్ 26(19)
2. శిఖర్ ధావన్ c వార్నర్ b సందీప్ శర్మ 0(1)
3. మార్క్యూస్ స్టోయినిస్ c వార్నర్ b నదీమ్ 5(6)
4. షిమ్రాన్ హెట్మేయర్ b రషీద్ ఖాన్ 16(13)
5. రిషబ్ పంత్ (wk) c (sub)గోస్వామి b సందీప్ శర్మ 36(35)
6. శ్రేయాస్ అయ్యర్ (c)c విలియమ్సన్ b విజయ్ శంకర్ 7(12)
7. అక్సర్ పటేల్ c (sub) ప్రియమ్ గార్గ్ b రషీద్ ఖాన్ 1(4)
8. కడిసో రబాడా b టి.నటరాజన్ 3(7)
9. రవిచంద్రన్ అశ్విన్ c అబ్దుల్ సమద్ b హోల్డర్ 7(5)
10. తుషర్ దేశ్‌పాండే నాటౌట్ 20(9)
11. ఎన్రిచ్ నొర్ట్జే c (sub)ప్రియమ్ గార్గ్ b టి.నటరాజన్ 1(3)

ఎక్స్‌ట్రాలు: 9

మొత్తం స్కోరు: 131-10

వికెట్ల పతనం: 1-1 (శిఖర్ ధావన్, 0.3), 14-2 (మార్క్యూస్ స్టోయినిస్, 1.6), 54-3 (షిమ్రాన్ హెట్మేయర్, 6.1), 55-4 (అజింక్య రహనే, 6.5), 78-5 (శ్రేయాస్ అయ్యర్, 11.3), 83-6 (అక్సర్ పటేల్, 12.5),103-7 (కగిసో రబాడా, 15.6), 103-8 (రిషబ్ పంత్, 16.1), 125-9 (రవిచంద్రన్ అశ్విన్, 17.6), 131-10 (ఎన్రిచ్ నొర్ట్జే, 18.6).

బౌలింగ్:

1. సందీప్ శర్మ 4-0-27-2
2. షాబాజ్ నదీమ్ 1-0-8-1
3. జాసన్ హోల్డర్ 4-0-46-1
4. రషీద్ ఖాన్ 4-0-7-3
5. టి. నటరాజన్ 4-0-26-2
6. విజయ్ శంకర్ 1.5-0-11-1
7. డేవిడ్ వార్నర్ 0.1-0-2-0


Next Story

Most Viewed