వెయ్యేళ్ల నాటి పాత్రకు సన్నీలియోన్ న్యాయం చేసేనా?

by  |
Sunny Leone
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ సన్నీలియోన్ పలు సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇప్పటికే ‘వీరమదేవి’ అనే తమిళ్‌ ఫిల్మ్‌లో నటిస్తున్న సన్నీ.. తాజాగా మరో కోలీవుడ్ ప్రాజెక్ట్‌ షూటింగ్‌లో జాయిన్ అయింది. కాగా ఈ హిస్టారికల్ హారర్ కామెడీ మూవీలో రాణిగా కనిపించబోతోందట. సతీష్, సంజన కీలక పాత్రల్లో నటిస్తుండగా.. క్లియోపాత్ర (దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం) టైమ్‌ పీరియడ్‌లో ఫ్లాష్ బ్యాక్‌ ఉండబోతోందని తెలిపాడు డైరెక్టర్ యువన్.

ఇక ప్రస్తుత పీరియడ్‌కు సంబంధించిన మేజర్ పోర్షన్స్ చెన్నైలో చిత్రీకరిస్తుండగా.. హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన సీన్స్ ముంబైలో స్పెషల్ సెట్‌లో చిత్రీకరిస్తామని తెలిపాడు. మూడేళ్లు కష్టపడి బౌండెడ్ స్క్రిప్ట్ రూపొందించానని, నిర్మాతలు శక్తి, శశికుమార్‌లకు కథ చెప్పగానే ఇంప్రెస్ అయినట్లు చెప్పాడు. ఆ తర్వాత మూవీలో మెయిన్ క్యారెక్టర్ కోసం సన్నీని సంప్రదించామని, స్టోరీ విన్న తర్వాత తను కూడా వెంటనే ఓకే చెప్పిందని వెల్లడించాడు.


Next Story

Most Viewed