పుష్ప సినిమాలో సన్ని పాప..?

by  |
పుష్ప సినిమాలో సన్ని పాప..?
X

దిశ, వెబ్‌డెస్క్: సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ఫ’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్, టాలీవుడ్‌లోని అగ్ర హీరోలతో సినిమాలు చేశారు. సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ప్రతి సినిమాలో ఐటెం సాంగ్‌ను ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఆర్య నుండి మొదలుకుంటే లాస్ట్‌గా వచ్చిన రంగస్థలం సినిమా వరకు అన్నింట్లో ఐటెం సాంగ్‌లతో క్రేజ్ పెంచారు.

అయితే పుష్ప సినిమాలో కూడా ఐటెం సాంగ్‌ గురించి ముగ్గురిని అనుకొని చివరిగా, మాజీ శృంగార తార సన్ని లియోన్‌ను ఓకే చేసినట్లు సమాచారం. పోర్నోగ్రఫీ నుండి పూర్తిగా తప్పుకున్న సన్నికి వరుసగా భారీ సినిమాల్లో చేసే చాన్స్‌లు వస్తున్నాయి. ఈ సినిమాకు సన్నిపాప రూ.50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.



Next Story

Most Viewed