కుటుంబం కోసం ఆ పని చేయక తప్పట్లేదు : సన్నీ లియోన్

by Shyam |   (  Updated:2021-04-16 01:45:57  IST  )

<p>దిశ, సినిమా: హాట్ బ్యూటీ సన్నీ లియోన్ లాస్ ఏంజిల్స్ నుంచి ఇండియాకు తిరిగొచ్చింది. ఇకపై ఫుల్ టైమ్ వర్క్ మీద కాన్సంట్రేట్ చేసేందుకు డిసైడ్ అయింది. ఈ మేరకు ఏప్రిల్ 17 నుంచి కేరళలో తన నెక్స్ట్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొననున్న సన్నీ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది. ‘ఈ పరిస్థితుల్లో పని చేయడం సులభం కాదు కానీ.. తనతో పాటు నిర్మాత, దర్శకులు, కాస్ట్ అండ్ క్రూ [&hellip;]</p>

sunny leone
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ సన్నీ లియోన్ లాస్ ఏంజిల్స్ నుంచి ఇండియాకు తిరిగొచ్చింది. ఇకపై ఫుల్ టైమ్ వర్క్ మీద కాన్సంట్రేట్ చేసేందుకు డిసైడ్ అయింది. ఈ మేరకు ఏప్రిల్ 17 నుంచి కేరళలో తన నెక్స్ట్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొననున్న సన్నీ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది. ‘ఈ పరిస్థితుల్లో పని చేయడం సులభం కాదు కానీ.. తనతో పాటు నిర్మాత, దర్శకులు, కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ అదే ప్రమాదంలో ఉన్నారని గుర్తించాల్సిన అవసరం ఉంది. పైగా సెట్‌లో ఉన్నప్పుడు సేఫ్టీ మెజర్‌మెంట్స్ ఉంటున్నాయి’ అని తెలిపింది.

ముగ్గురు పిల్లలకు తల్లి అయిన తను ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లి పనిచేయడం కష్టమైన పనే అయినా తప్పడం లేదని చెప్పింది సన్నీ. ఫ్యామిలీకి అన్నీ సమకూర్చేందుకు ఎలాంటి సిచ్యుయేషన్‌లో అయినా కష్టపడాల్సి వస్తుందని, అలాంటప్పుడు ఇంట్లో కూర్చుంటే పరిష్కారం దొరకదు కదా అని అభిప్రాయపడింది. ప్రతీ ఒక్కరు కూడా వారి కుటుంబాన్ని, ఇంటిని, పిల్లలను జాగ్రత్తగా చూసుకునేందుకే పనిచేస్తారని.. అదే పని తాను చేస్తున్నానని తెలిపింది. ఈ క్రమంలోనే కుటుంబ సంరక్షణను దృష్టిలో ఉంచుకుని రెండు మూడు రోజులకోసారి కొవిడ్ టెస్ట్ చేయించుకుంటున్నానని తెలిపింది.

Next Story