హిట్‌మ్యాన్‌కు టీ20 పగ్గాలు.. ఇదేం ఐపీఎల్ కాదని హెచ్చరించిన సునీల్ గవాస్కర్

249

దిశ, వెబ్‌డెస్క్: భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను హెచ్చరించాడు. ఐపీఎల్‌లో ముంబై జట్టును నడిపించడం వేరు, భారత జట్టును నడిపించడం వేరు అని హెచ్చరించారు. భారత జట్టును నడిపించడం ఐపీఎల్ ఫ్రాంచైజీకి నాయకత్వం వహించడం కంటే భిన్నమైనది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ T20 ఫార్మట్‌కి బెస్ట్ కెప్టెన్ అని నేను పూర్తిగా నమ్ముతున్నాను.. రోహిత్ ఐపీఎల్‌లో ముంబై జట్టుకు సారధిగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకున్నాడు. కానీ, ముంబై జట్టుకు నాయకత్వం వహించడం, భారత జట్టుకు నాయకత్వం వహించడం పూర్తి భిన్నం’’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు రోహిత్ శర్మ పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని, రోహిత్ నాయకత్వంలో భారత టీ20 క్రికెట్‌కు ఇది కొత్త ప్రారంభం అని అన్నాడు.

అలాగే, T20లో భారత కొత్త వైస్ కెప్టెన్‌గా ఎంపికైన KL రాహుల్‌పై కూడా గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. రాహల్ మూడు ఫార్మాట్లలో ఆడగల సామర్థ్యం ఉన్నవాడు. T20లో భారత కొత్త వైస్ కెప్టెన్సీకి అతను అర్హుడే అని పొగిడాడు. రాహుల్‌ను సెలక్టర్లు భవిష్యత్ నాయకుడిగా గుర్తించారు.