ఆదివారం పంచాంగం, రాశి ఫలాలు (11-04-2021)

137
Panchangam
Panchangam

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం బహుళ పక్షం
తిధి : అమావాస్య పూర్తి
వారం : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉ 8.37
తదుపరి రేవతి
యోగం : ఐంద్రం మ 1.38
తదుపరి వైధృతి
కరణం : చతుష్పాత్ సా 6.17
తదుపరి నాగవం
వర్జ్యం : రా 9.37 – 11.21
దుర్ముహూర్తం : సా 4.31 – 5.20
అమృతకాలం: లేదు
రాహుకాలం : సా 4.30 – 6.00
యమగండం/కేతుకాలం: మ 12.00 – 1 30
సూర్యరాశి: మీనం || చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 5.50 || సూర్యాస్తమయం: 6.10

రాశి ఫలాలు

మేషం

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది దూరప్రయాణాలు సూచనలు ఉన్నవే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెడతారు వ్యాపార ఉద్యోగాలలో అంతంతమాత్రంగానే ఉంటాయి.​

వృషభం

పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అంచనాలకు మించిన ఆదాయం ఉంటుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు.​

మిధునం

సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన పురోగతి పొందుతారు. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.​

కర్కాటకం

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి సహాయం అందక నిరాశ కలుగుతుంది వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహంగా సాగుతాయి.​

సింహం

రావలసిన ధనం చేతికి అందక నిరాశ కలుగుతుంది చేపట్టిన పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. ధన వ్యయ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు తప్పవు.


కన్య

భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు నూతనవ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

తుల

సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధు మిత్రులతో వివాదాలు తీరుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి అధిగమిస్తారు.​

వృశ్చికం

అధిక శ్రమతో స్వల్ప ఫలితాన్ని పొందుతారు సోదరులతో ఆస్తి వివాదాలు పెరుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. వృత్తి వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి.ఉద్యోగపరంగా సకాలంలో పనులు పూర్తికాక మానసిక సమస్యలు కలుగుతాయి. ​

ధనస్సు

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది నూతన ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి ప్రశాంతత కోసం దైవదర్శనం చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.​

మకరం

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితులు సలహాలు కలిసివస్తాయి నూతన వస్తు లాభాలు పొందుతారు సమాజంలో పెద్దల నుండి సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.​

కుంభం

ఇంటాబయటా పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి బంధు మిత్రుల మాటలు మానసికంగా బాధ కలిగిస్తాయి. అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ​

మీనం

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ విషయాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉన్నతి కలుగుతుంది.


 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..