ఆదివారం పంచాంగం, రాశిఫలాలు (09-05-2021)

by  |
ఆదివారం పంచాంగం, రాశిఫలాలు (09-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : త్రయోదశి
(నిన్న సాయంత్రం 5 గం॥ 24 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 32 ని॥ వరకు)
నక్షత్రం : రేవతి
(నిన్న మధ్యాహ్నం 2 గం॥ 50 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 30 ని॥ వరకు)
యోగము : ప్రీతి
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 10 ని॥ నుంచి 5 గం॥ 56 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (మధ్యాహ్నం 2 గం॥ 50 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 36 ని॥ వరకు)
దుర్ముహూర్తం : ( సాయంత్రం 4 గం॥ 55 ని॥ నుంచి 5 గం॥ 46 ని॥ వరకు)
రాహుకాలం : ( సాయంత్రం 5 గం॥ 1 ని॥ నుంచి రాత్రి 6 గం॥ 37 ని॥ వరకు)
గుళికకాలం : ( సాయంత్రం 3 గం॥ 25 ని॥ నుంచి 5 గం॥ 1 ని॥ వరకు)
యమగండం : ( ఉదయం 12 గం॥ 12 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 48 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 38 ని॥ లకు
సూర్యరాశి : మేషము
చంద్రరాశి : మీనము
విశేషం : మాసశివరాత్రి

మేష రాశి : శుభకార్య సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విఫలం అవుతారు. స్త్రీలతో వైరం చాలా ప్రమాదకరం జాగ్రత్త. ఈరోజు మధువు మాంసము అన్య స్త్రీలతో వ్యవహారములు వదిలివేయండి. కుటుంబంతో కలిసి షాపింగ్ చేస్తారు. ఈ రాశి స్త్రీలు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు.

వృషభ రాశి : మీ శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులను వాయిదా వేయండి. దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. కరోనాతో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ రాశి స్త్రీలకు నమ్మిన వ్యక్తులు డబ్బు దగ్గర మిమ్ములను మోసం చేసే అవకాశం. జాగ్రత్త వహించండి.

మిథున రాశి : పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు. గతంలో మిమ్ములను కించపరిచిన వారే ఇప్పుడు గౌరవిస్తారు. ఒకనాటి మిత్రులు ఆగర్భ శత్రువుల్లా అవుతారు జాగ్రత్తపడండి. ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడం వల్ల కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగంలో బాధ్యతలు అధికారము పెరుగుతాయి.

కర్కాటక రాశి : విపరీతమైన ఆలోచనలను అశాంతిని అదుపులో పెట్టుకోండి. మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు. ఉద్యోగంలో నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పై అధికారుల మెప్పు పొందుతారు. కరోనా వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ రాశి స్త్రీలకు ఎంతో కాలంగా అనుకుంటున్న పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు.

సింహ రాశి : మీరు స్వంతముగా ప్రారంభించిన పనులు నెరవేరే అవకాశం. విద్యార్థులకు మంచి గుర్తింపు కాలం. మీరు ఇంతకు ముందు బంధువుల దగ్గర తీసుకున్న రుణాన్ని తిరిగి ఇచ్చి వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశి స్త్రీలకు అన్యభాషలు నేర్చుకోవాలన్న మీ ప్రయత్నాలు అంతగా ఫలించవు.

కన్య రాశి : నూతన వ్యాపారముల కొరకు ప్రయత్నము కన్నా ఉన్న వ్యాపారమును సరిదిద్దు కొనుట మంచిది. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం. అందువల్ల ఉదయాన్నే లేచి సూర్యభగవానుడికి నమస్కారం చేయండి. విపరీతమైన ఆలోచనలు అశాంతి మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

తుల రాశి: మీరు చేస్తున్న వృత్తి వ్యాపారములలో అమ్మకములు పెరిగి ధన ఆదాయము పెరుగును. శుభ కార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకోకుండా ముడి పడతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. శత్రువర్గం వారు అందరూ ఒకటవడం వల్ల మీరు ఒంటరి వారవుతారు. ఈ రాశి స్త్రీలకు ప్రభుత్వ సంబంధిత అవార్డులు లభిస్తాయి.

వృశ్చిక రాశి: మీ ఓర్పు, అలుపెరుగని శ్రమ మరియు మీ జాగరూకత ఇవన్నీ కలిసి మిమ్ములను విజయం వైపు నడిపిస్తాయి. పనికిమాలిన వ్యక్తులను గొప్పవారిగా నమ్మటం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కరోనాతో ఎటువంటి ఇబ్బందులు లేవు. కోర్టు వ్యవహారములు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు రాశి : ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. ఎవరు చెప్పినా వినక పోవడం వల్ల కుటుంబమున మనస్పర్ధలు. వాహనములు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ వలన గాని ఎదుటి వ్యక్తి వలన గాని యాక్సిడెంట్ కు అవకాశాలు. మీ తోటి ఉద్యోగులు మీ మీద చేస్తున్న నిందలను తిప్పికొడతారు. ఈ రాశి స్త్రీలు ఇచ్చిన డబ్బులు తిరిగి రావు జాగ్రత్త.

మకర రాశి : చిన్న మొత్తంలో పెట్టిన పెట్టుబడులు మీకు అధిక లాభాలను తెస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఏలినాటి శని ప్రభావం వల్ల భోజనం సమయానికి చెయ్యలేరు. ఈ రాశి స్త్రీలు ఇంటికి అవసరమైన ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి : మీరు చేస్తున్న ధనము ఖర్చు మంచికో చెడుకో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది. నెగిటివ్ ఆలోచనలు మాని ప్రతి విషయాన్ని సానుకూలంగా ఆలోచించండి. గృహ నిర్మాణాలకు ఆటంకములు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో కొన్ని విషయాలు మిమ్ములను నిరాశకు గురి చేస్తాయి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాశి స్త్రీలకు ప్రేమ వివాహాలు సఫలము కావు.

మీన రాశి : కుటుంబ వ్యక్తుల అవసరాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వండి. స్త్రీల పట్ల గౌరవ మర్యాదలతో మెలగండి లేకపోతే లేనిపోని చిక్కులు రావచ్చు. కరోనాతో ఎటువంటి ఇబ్బందులు లేవు. ముఖ్యమైన వ్యవహారాలు ఆలస్యం అయినప్పటికీ చివరకు మంచే జరుగుతుంది. ఈ రాశి స్త్రీలు మీ పెద్ద వారితో మీ ఆలోచనలను పంచుకోండి దాని వలన మంచి జరుగుతుంది.


Next Story