ఏపీలో పెట్టుబడులకు సన్ ఫార్మా కంపెనీ.. త్వరలోనే ప్లాంట్ ఏర్పాటు 

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రానికి మరో భారీ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమైంది. ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్‌ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించిది. ఈ మేరకు సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ షాంఘ్వీ  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో మంగళవారం సమావేశమయ్యారు. ఇంటిగ్రేటెడ్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ప్లాంట్‌గా దీన్ని తీసుకొస్తామని, ఎగుమతుల లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయని కంపెనీ ఎండీ దిలీప్‌ షాంఘ్వీ సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్‌ [&hellip;]</p>

sun pharma
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రానికి మరో భారీ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమైంది. ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్‌ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించిది. ఈ మేరకు సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ షాంఘ్వీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో మంగళవారం సమావేశమయ్యారు. ఇంటిగ్రేటెడ్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ప్లాంట్‌గా దీన్ని తీసుకొస్తామని, ఎగుమతుల లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయని కంపెనీ ఎండీ దిలీప్‌ షాంఘ్వీ సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్‌ రంగం ప్రగతి, సన్‌ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం కంపెనీ ప్రతినిధులకు వివరించారు. అవకాశాలను వినియోగించుకుని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పరిశ్రమలకు అత్యంత పారదర్శక విధానాలు అందుబాటులో ఉన్నాయని, నైపుణ్యాభివృద్ధిని పెంచడం ద్వారా నాణ్యమైన మానవనరులను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని సీఎం వివరించారు.

sun pharma

సీఎం విజ‌న్‌ అద్భుతం: దిలీప్‌ షాంఘ్వీ

రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఎదుర్కొంటున్న సవాళ్లమీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉన్న అవగాహనకు తాను ముగ్దుడినయ్యాను అంటూ సన్ ఫార్మా అధినేత దిలీప్ షాంఘ్వీ అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అన్నది సీఎం విధానంగా స్పష్టమవుతోందని తెలిపారు. పర్యావరణ‌హిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టితో ఉన్నారని.. సాంకేతికతను బాగా వినియోగించుకుని అత్యంత సమర్థత ఉన్న మానవనవరులను తయారు చేయడంద్వారా ప్రజల ఆదాయాలను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పుకొచ్చారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా సీఎం ముందడుగు వేస్తున్నారని కొనియాడారు.

సన్‌ ఫార్మా తరఫున ఒక పరిశ్రమను నెలకొల్పుతామని వెల్లడించారు. పరిశ్రమలకు చక్కటి సహకారం, మద్దతును సీఎం ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఔషధ రంగంలో త‌మ‌ ఆలోచనలను సీఎంతో పంచుకున్నామని, ఇంటిగ్రేటెడ్‌ తయారీ యూనిట్‌పై మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఔషధాలను ఎగుమతి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో స‌న్‌ఫార్మా కంపెనీ ప్రతినిధులు విజయ్‌ పారెఖ్, సౌరభ్‌ బోరా, విద్యాసాగర్ పాల్గొన్నారు.

Next Story