గత నాలుగేళ్లలో అతిపెద్ద సౌర విస్ఫోటనం ఇదే..

by  |
sun-blast
X

దిశ, ఫీచర్స్ : ఆకాశంలో అతిపెద్ద సౌర జ్వాల ఆదివారం రాత్రి సంభవించి, ఆ వెంటనే అదృశ్యమైంది. 2017లో జరిగిన సౌర విస్ఫోటనం కన్నా దీని తీవ్రత ఎక్కువ. ఇది భూమిపై రేడియో బ్లాక్‌అవుట్స్‌కు కారణమవుతుందని ‘యూఎస్ స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్(SWPC)’ అఫిషియల్స్ వెల్లడించారు. సౌర జ్వాల నుంచి వెలువడే బలమైన ఎక్స్-కిరణాలు భూ వాతావరణంలోకి ప్రవేశించి అధికమైన, తక్కువ తీవ్రతతో కూడిన ఫ్రీక్వెన్సీ గల రేడియో సిగ్నల్స్‌ను దెబ్బతీసినపుడు ఈ బ్లాక్‌అవుట్స్ ఏర్పడతాయి. కాగా సూర్యునిలో AR2838గా పిలువబడే భాగంలో ఈ విస్ఫోటనం కనిపించగా, దీన్ని X-1 క్లాస్ సన్ ఈవెంట్‌గా వర్గీకరిస్తారని పేర్కొన్నారు.

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) రిలీజ్ చేసిన వీడియోలో.. సూర్యుని ఎగువ భాగం కుడివైపు నుంచి బయటపడ్డ సౌర జ్వాలను చూడొచ్చు. ఈ సన్ స్పాట్ రాత్రికి రాత్రే ఏర్పడిందని SWPC అధికారులు తెలిపారు. కొద్ది క్షణాల్లోనే మాయమైన సౌర జ్వాల.. తుఫాన్‌‌లా విస్ఫోటనం చెందిందని స్పేస్ వెదర్ వాచర్, ఆస్ట్రానమర్ డాక్టర్ టోనీ ఫిలిప్స్ వివరించారు. ఈ పరిణామం సోలార్ యాక్టివిటీలో అనూహ్యతను చూపిస్తుందన్న ఫిలిప్స్.. మరిన్ని విస్ఫోటనాలు సంభవించవచ్చని తెలిపారు.

https://akm-img-a-in.tosshub.com/indiatoday/images/story/202107/Solar_flare.jpg?NvkvFqcRMPloSV6g6woIPrRxUQlUYHKz&size=770:433

సోలార్ ఫ్లేర్(సౌర జ్వాల) అంటే ఏమిటి?

సౌర జ్వాల అనేది సూర్యుని ఉపరితలంపై అకస్మాత్తుగా, అతి తీవ్రంగా సంభవించే పేలుడు. అయస్కాంత క్షేత్రాల్లో భారీ పరిమాణంలో నిల్వ చేయబడిన శక్తి ఒక్కసారిగా విడుదలైనప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఈ పేలుడు విశ్వమంతటా రేడియేషన్‌ను రిలీజ్ చేయడంతో పాటు సౌర వ్యవస్థలోని గ్రహాల గమనాన్ని దెబ్బతీస్తుంది. ఈ రేడియేషన్స్‌లో రేడియో తరంగాలతో పాటు ఎక్స్ & గామా కిరణాలు ఉంటాయి. ఈ పేలుడు ద్వారా విడుదలయ్యే శక్తి.. మిలియన్ సంఖ్యలో 100 మెగాటన్ హైడ్రోజన్ బాంబులు ఒకేసారి పేలిపోతే విడుదలయ్యే శక్తికి సమానమని నాసా తెలిపింది. ఇది సూర్యుని ద్వారా ఉత్పత్తయ్యే మొత్తం శక్తిలో 1/10 వంతు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సోలార్ ఫైర్ మూడు స్టేజీల్లో సంభవించనుండగా.. ప్రికర్సర్ అనే మొదటి స్టేజిలో సాఫ్ట్ ఎక్స్-కిరణాలతో అయస్కాంత శక్తి విడుదలవుతుంది. మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్‌కు సమానమైన శక్తికి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ యాక్సిలరేట్ అయినపుడు రెండో దశ(ఇంపల్సివ్) మొదలవుతుంది. ఇక మూడో దశలో ఎక్స్-కిరణాల నిర్మాణం క్రమంగా పెరిగి ఆ వెంటనే తగ్గిపోతుంది. ఈ దశల వ్యవధి కొన్ని సెకన్ల నుంచి గంటల వరకు ఉండే చాన్స్ ఉంది.

సోలార్ ఫ్లేర్స్‌లో రకాలు..

ఎక్స్-రే బ్రైట్‌నెస్‌ ఆధారంగా సైంటిస్టులు సౌర జ్వాలలను మూడు రకాలుగా వర్గీకరించారు. ఇక ఆదివారం రాత్రి వెలువడ్డ సౌర జ్వాల X-క్లాస్ కాగా, ఇది అతి పెద్దదని తెలుస్తోంది. ఈ రకమైన మంటలు రేడియో బ్లాక్అవుట్లను ప్రేరేపించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఇక M-క్లాస్‌గా పిలువబడే మిడిల్ క్లాస్ ఫ్లేర్స్.. ధ్రువ ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి. మూడో రకమైన C-క్లాస్ ఫ్లేర్స్ భూమిపై పాక్షిక ప్రభావాన్ని చూపగలవు అని సైంటిస్టులు తెలిపారు.

Next Story

Most Viewed