సుమిత్ నగల్‌కు ఆస్ట్రేలియా ఓపెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

by  |
సుమిత్ నగల్‌కు ఆస్ట్రేలియా ఓపెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగల్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతాలకు చెందిన ఇద్దరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అందజేశారు. ఇండియాకు చెందిన సుమిత్ నగల్‌తో పాటు చైనాకు చెందిన వాంగ్ యూ‌కు ఆహ్వానాలు అందాయి. వీరిద్దరితో పాటు డారియా గవ్రిలోవా, అస్త్ర శర్మ, క్రిస్టఫర్ ఒ కానెల్, మాడిసన్ ఇంగ్లిస్, లిజ్జి కాబెరా, మార్క్ పోల్‌మాన్స్‌కు కూడా ఆస్ట్రేలియా ఓపెన్‌ మెయిన్ డ్రాకు ఎంపికయ్యారు.

మరోవైపు టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లాండ్ ఆటగాడు ఆండీ ముర్రె తిరిగి కోర్టులోకి అడుగుపెడుతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ఈ మాజీ నెంబర్ వన్ ఆటగాడికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అతడితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన థనాసి కొక్కినాకిస్, అలెక్స్ బోల్ట్, అలెక్సాండర్ వుకిక్, డెస్టనీ అయావా, అరినా రొడియోనోవాకు కూడా మెయిన్ డ్రాలో చోటు దక్కింది. ఫిబ్రవరి 8 నుంచి 21 వరకు మెల్‌బోర్న్ పార్క్‌లో ఆస్ట్రేలియా ఓపెన్ జరుగనుంది.

Next Story

Most Viewed