- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనం పోతే డబ్బులు ఏం చేస్తాం..? : సుకుమార్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: దర్శకుడు సుకుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా ప్రభావానికి ప్రజలు అతలాకుతలం అవుతుండడంతో తన వంతు సహాయంగా తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అంతటితో ఆగకుండా… ఏపీలోని మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన సుకుమార్… తన మూలాలు మరిచిపోకుండా సొంత గ్రామానికి రూ. 5 లక్షల సాయాన్ని అందించారు. ఆ గ్రామ ప్రజలచే నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుకుమార్… మనం చనిపోతే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దర్శకుడు సుకుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా ప్రభావానికి ప్రజలు అతలాకుతలం అవుతుండడంతో తన వంతు సహాయంగా తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అంతటితో ఆగకుండా… ఏపీలోని మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన సుకుమార్… తన మూలాలు మరిచిపోకుండా సొంత గ్రామానికి రూ. 5 లక్షల సాయాన్ని అందించారు. ఆ గ్రామ ప్రజలచే నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సుకుమార్… మనం చనిపోతే డబ్బులు ఏం చేస్తాం..? నాలాంటి వారు మీరు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకుగాను ప్రజలంతా ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని… స్వీయ నియంత్రణ పాటిస్తూ లాక్ డౌన్‌కు సహకరించాలని కోరారు.
Tags: Sukumar, Director, CoronaVirus, Covid19, Donation
Next Story






