అవమానం భరించలేక యువకుని ఆత్మహత్య

25

దిశ, కల్వకుర్తి: ప్రేమపేరుతో తన కూతురిని వేదిస్తున్నాడని యువతి తల్లి కోటమ్మ తనను కొట్టి అవమాన పర్చిందని జోగు పరుశరములు(22) అనే యువకుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం… ఈనెల ఒకటో తేదీన కల్వకుర్తి పుర పరిధిలోని సిలార్పల్లి గ్రామంలో ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని యువతి తల్లి పరుశరములు ఇంటికి వెళ్లి గోడవపెట్టుకొని కొట్టింది. అవమానాన్ని భరించలేక పరుశరములు అదేరోజు తన ఇంటి మిద్దెపై విషం సేవించాడు. అపస్మారక స్థితిలో ఉన్న పరుశరములును కుటుంబ సభ్యులు గమనించి కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మంగళవారం మృతి చెందాడని, మృతుని తండ్రి చిన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..