- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇంతలోనే దారుణం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో : ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. వేటపాలెం మండలం కొత్తపేటలో నాగేంద్రబాబు అనే యువకుడు గ్రామ వలంటీర్‌గా చేస్తున్నాడు. అదే సచివాలయంలో ఓ మహిళా పోలీస్.. విధులు నిర్వహిస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో : ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. వేటపాలెం మండలం కొత్తపేటలో నాగేంద్రబాబు అనే యువకుడు గ్రామ వలంటీర్‌గా చేస్తున్నాడు. అదే సచివాలయంలో ఓ మహిళా పోలీస్.. విధులు నిర్వహిస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు.
వీరి ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు నాగేంద్ర బాబుపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ క్రమంలో వివాదం కాస్తా ముదిరింది. తీవ్ర మనస్తాపానికి గురైన నాగేంద్ర బాబు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






