- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య
<p>దిశ, మునుగోడు: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మునుగోడు మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పందుల సైదులు(40) ఆర్థిక ఇబ్బందులు అధిగమించలేక తనలో తానే గత కొన్ని రోజులుగా కుమిలిపోతున్నాడు. ఇబ్బందులను అధిగమించే మార్గం కానరాక శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మునుగోడు ఎస్ఐ రజనీకర్ […]</p>

X
దిశ, మునుగోడు: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మునుగోడు మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పందుల సైదులు(40) ఆర్థిక ఇబ్బందులు అధిగమించలేక తనలో తానే గత కొన్ని రోజులుగా కుమిలిపోతున్నాడు.
ఇబ్బందులను అధిగమించే మార్గం కానరాక శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మునుగోడు ఎస్ఐ రజనీకర్ రెడ్డి తెలిపారు. మృతుడు సైదులుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సైదులు మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడి తల్లి మారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మునుగోడు ఎస్ఐ తెలిపారు.
Next Story






