యువకుడు ఆత్మహత్యాయత్నం.. రెప్పపాటులో కాపాడిన సీఐ

by Shyam |

<p>దిశ, మహబూబ్‌నగర్: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి.. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతుండగా, గమనించిన ఆత్మకూరు సీఐ.. రెప్పపాటులో కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం.. రేవల్లి మండలానికి చెందిన భాస్కర్‌కు ఆత్మకూర్ మండలం బలకిష్టాపూర్ గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. అమ్మగారి ఇంటికి వెళ్లిన భార్య.. లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో భార్యతో గొడవపడ్డ భాస్కర్.. శుక్రవారం మధ్యాహ్నం మదనపూర్ మండలం గోపన్‌పేట, కొత్తపల్లి గ్రామాల్లోని బ్రిడ్జిపై నుంచి దూకేందుకు యత్నించగా ఆత్మకూర్ నుంచి [&hellip;]</p>

యువకుడు ఆత్మహత్యాయత్నం.. రెప్పపాటులో కాపాడిన సీఐ
X

దిశ, మహబూబ్‌నగర్: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి.. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతుండగా, గమనించిన ఆత్మకూరు సీఐ.. రెప్పపాటులో కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం.. రేవల్లి మండలానికి చెందిన భాస్కర్‌కు ఆత్మకూర్ మండలం బలకిష్టాపూర్ గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. అమ్మగారి ఇంటికి వెళ్లిన భార్య.. లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో భార్యతో గొడవపడ్డ భాస్కర్.. శుక్రవారం మధ్యాహ్నం మదనపూర్ మండలం గోపన్‌పేట, కొత్తపల్లి గ్రామాల్లోని బ్రిడ్జిపై నుంచి దూకేందుకు యత్నించగా ఆత్మకూర్ నుంచి మాదనపూర్‌కు వెళ్తున్న సీఐ సీతయ్య అతన్ని గమనించారు. రెప్పపాటులో వాహనం నుంచి దిగి దూకబోతున్న భాస్కర్‌ను కాపాడి, మాదనపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితుడికి పూర్తిస్థాయిలో కౌన్సిలింగ్ ఇప్పించి, కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఎసై సైదులును ఆదేశించారు.

Tags: Suicide attempt, young man, Rescued CI, mahabubnagar, atmakur ci

Next Story