సుధాకర్‌కు అండగా ఉంటా : చిరంజీవి

by  |
సుధాకర్‌కు అండగా ఉంటా : చిరంజీవి
X

దిశ, వెబ్‌డెస్క్ : శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమై.. ‘కుందనపు బొమ్మ, నువ్వు తోపురా’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల‌కు ద‌గ్గరైన నటుడు సుధాకర్ కోమాకుల. ఇటీవల ఆయన, త‌న శ్రీమ‌తి హారిక‌తో క‌లిసి ఛాలెంజ్ చిత్రంలోని ‘ఇందువదన కుందరదన’ పాటను రీక్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వీరి ప‌ర్ఫార్మెన్స్‌కు మెగా ఫ్యాన్స్‌తో పాటు చిరంజీవి కూడా ఇంప్రెస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే సుధాకర్ దంపతులు.. చిరంజీవికి న్యూ ఇయర్ విషెస్ తెలిపేందుకు ఆయన ఇంటికెళ్లారు. ఈ సందర్భంగా చిరు వారిద్దరికీ తన బ్లెస్సింగ్స్ ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో వాళ్లు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ కావాలని కోరుకున్నారు. అంతేకాదు సుధాకర్‌‌కు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నారు మెగాస్టార్. కాగా ఈ రోజు తమ జీవితంలో ఓ బిగ్ డే అని, చిరంజీవి అందిస్తున్న పోత్సాహం నాలో మరింత ఉత్సాహాన్ని నింపిందని సుధాకర్ తెలిపాడు.

Next Story

Most Viewed