సొరంగాల్లో విమాన ప్రయాణం.. గిన్నిస్ రికార్డ్‌లో చోటు!

by Shyam |

<p>దిశ, ఫీచర్స్ : విమానాలతో వినువీధుల్లో విన్యాసాలు చేస్తుంటారని తెలిసిన విషయమే. కానీ ఇటాలియన్ స్టంట్ పైలట్ డారియో కోస్టా గాల్లోనే కాదు, సొరంగాల్లోనూ తన అద్భుత ప్రదర్శనతో నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే టర్కీలోని ఇస్తాంబుల్‌లోని రెండు సొరంగాల్లో విమానాన్ని నడిపి రికార్డ్ సృష్టించాడు. డేరింగ్ స్టంట్ పైలట్ డారియో కోస్టా తొలిసారిగా 360 మీటర్ల టన్నెల్‌లో తన రైడ్ పూర్తి చేసి విజయవంతమయ్యాడు. ఆ వెంటనే 1,160 మీటర్ల సొరంగంలోనూ ప్రయాణించి, రికార్డ్ సృష్టించాడు. [&hellip;]</p>

Dario Costa
X

దిశ, ఫీచర్స్ : విమానాలతో వినువీధుల్లో విన్యాసాలు చేస్తుంటారని తెలిసిన విషయమే. కానీ ఇటాలియన్ స్టంట్ పైలట్ డారియో కోస్టా గాల్లోనే కాదు, సొరంగాల్లోనూ తన అద్భుత ప్రదర్శనతో నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే టర్కీలోని ఇస్తాంబుల్‌లోని రెండు సొరంగాల్లో విమానాన్ని నడిపి రికార్డ్ సృష్టించాడు.

డేరింగ్ స్టంట్ పైలట్ డారియో కోస్టా తొలిసారిగా 360 మీటర్ల టన్నెల్‌లో తన రైడ్ పూర్తి చేసి విజయవంతమయ్యాడు. ఆ వెంటనే 1,160 మీటర్ల సొరంగంలోనూ ప్రయాణించి, రికార్డ్ సృష్టించాడు. స్టంట్ పూర్తిచేయడానికి 43.44 సెకన్లు పట్టగా, నాలుగు ఇతర రికార్డులతో పాటు ఎయిర్‌ప్లేన్ (1,730 మీ) ద్వారా పొడవైన టన్నెల్ దాటి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. ఈ స్టంట్ వీడియోను ఆస్ట్రియన్ కంపెనీ రెడ్ బుల్ షేర్ సోషల్ మీడియాలో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్‌గా మారింది.

https://twitter.com/redbull/status/1434142367674732553?s=20

‘ప్రయాణం ఎంతో వేగంగా సాగింది. కానీ మొదటి సొరంగం నుంచి బయటకు వచ్చినప్పుడు క్రాస్‌విండ్స్ కారణంగా నా విమానం కుడి వైపునకు కదలడం ప్రారంభించింది. దాంతో కాస్త ఆందోళనపడ్డాను. కానీ వెంటనే తేరుకుని, రెండో టన్నెల్‌లోకి ప్రవేశించడానికి విమానాన్ని సరైన మార్గంలోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాను. ఈ ఫీట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు టన్నెల్‌లో విమానంలో ప్రయాణించలేదు. అలాంటి సాహసం ఎవరూ చేయలేదని అనుకుంటున్నాను. అందువల్లే ఊహించిన విధంగానే ప్రయాణం సాఫీగా సాగుతుందా? లేదా అనే సందేహం ఉండేది. కానీ అంతా పర్‌ఫెక్ట్‌గా జరిగిపోయింది. నా కల నెరవేరింది’
– డారియో కోస్టా, స్టంట్ పైలట్

Next Story